Share News

Mohammad Shami: నేను సౌత్ సినిమాలు చూస్తాను.. నాకు ఇష్టమైన హీరోలు వాళ్లే!

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:07 PM

మహ్మద్ షమీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీమిండియా స్టార్ పేసర్‌గా క్రికెట్ చూసే వారికి బాగా తెలుసు. గత అక్టోబర్, నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

Mohammad Shami: నేను సౌత్ సినిమాలు చూస్తాను.. నాకు ఇష్టమైన హీరోలు వాళ్లే!

మహ్మద్ షమీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీమిండియా స్టార్ పేసర్‌గా క్రికెట్ చూసే వారికి బాగా తెలుసు. గత అక్టోబర్, నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తుది జట్టులోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. టీమిండియా ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రపంచకప్ ప్రదర్శనతో క్రికెట్ చూడని వారు కూడా షమీ గురించి తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం గాయం కారణంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న షమీ ఓ సెలెబ్రిటీ హెయిర్ ప్లాంటెషన్ సెంటర్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా దక్షిణాది సినిమాలపై, టాలీవుడ్ హీరోలపై తనకు ఉన్న అభిమానం గురించి అభిమానులతో పంచుకున్నాడు. దక్షిణాది సినిమాలు బాగా చూస్తాను అని చెప్పిన షమీ.. తెలుగు, తమిళం భాషలు అర్థం కావు కాబట్టి డబ్బింగ్ అయిన మూవీస్ చూస్తానని తెలిపాడు.


అలాగే సౌత్‌లో రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తనకు ఇష్టమైన హీరోలు అని చెప్పాడు. బాహులి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలను చూడడం తనకు చాలా ఇష్టమని పేర్కొన్నాడు. క్రికెట్ ఆడే సమయంలో సినిమాల గురించి సరదాగా మాట్లాడుకుంటామని తెలిపాడు. ముఖ్యంగా సౌత్ హీరోల గురించి చర్చించుకుంటామని చెప్పుకొచ్చాడు. తన బయోపిక్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవని చెప్పాడు. ఒకవేళ చేసినా ఎవరు నటిస్తారనదేది చెప్పలేనని అన్నాడు. కాగా హైదరాబాద్‌లో ఓ హెయిర్ ట్రాన్స్‌ప్లెంట్ సెంటర్‌ను ప్రారంభించిన షమీ.. తాను కూడా ఆ సంస్థలోనే హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నానని చెప్పాడు. దీంతో తనకు గతంలో మాదిరిగా జుట్టు ఒత్తుగా పెరిగినట్టు తెలిపాడు. ఈ కారణంగానే తాను ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిండర్‌గా చేస్తున్నట్టు చెప్పాడు. ఇక హైదరాబాద్ నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పిన షమీ.. తాను ఇక్కడికి ఎప్పుడు వచ్చిన బిర్యానీ తినకండా వెళ్లను అని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 20 , 2024 | 01:07 PM