Home » Parliament
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
వందేమాతరం గేయాన్ని అవమానించిన వారికి శిక్ష పడేలా కేంద్రం కొత్త బిల్లును రాజ్యసభలో నేడు ప్రవేశపెట్టింది.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రతిపక్ష పార్టీల నేతలు శుక్రవారం పార్లమెంట్ భవన ప్రాంగణంలో నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఉభయ సభల్లో పేపర్ లీక్ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
'నీట్' వ్యవహారంపై నేటికి వరుసగా ఐదో రోజు పార్లమెంట్‌లోని 'మకర్ ద్వార్' వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లేదా ఆయనను బర్తరఫ్ చేయాలని విపక్ష ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు.
నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ సమావేశాన్ని కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా వేశారు.
NEET పరీక్ష వ్యవహారం, పేపర్ లీక్‌ల అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా? అని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విపక్షాలకు సవాల్ విసిరారు. సభ ముందుకు వస్తే వారి 'ద్వంద్వ నీతి' బయటపడుతుందనే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ జిల్లాలోని ఓ పార్లమెంట్ పరిధిలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) జోరుగా సాగుతుండగా.. మరో పార్లమెంట్ పరిధిలో నామ్ కే వాస్తేగా జరుగుతోంది.
పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టిన సీజేపీతో కేంద్రం చర్చలకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ కానున్నట్టు సీజేపీ వెల్లడించింది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమావేశాలకు ముందు పార్లమెంట్ భవనం వెలుపల ప్రసంగిస్తూ రాహుల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిజినెస్ లిస్ట్‌ను సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ గురువారం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది.