Home » Pakistan
బిజాపూర్‌లోని వర్షప్రభావిత ప్రాంతంలో బాధితుల కోసం సహాయ సామగ్రితో హెలికాప్టర్ వెళ్తుండగా మొహమాండ్ జిల్లా పాండియాలి వద్ద కుప్పకూలిందని గందాపుర్ తెలిపారు. వాతావరణ ప్రతికూలత కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు.
ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిల మతం మార్చి హైదరాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్న పాకిస్థాన్ యువకుడు ఫహద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా ఫహద్.. కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. రెండు దేశాల్లోనూ ఉద్రిక్తతలు ఇప్పుడే చల్లబడుతున్న నేపథ్యంలో పాక్ నేతలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. అణుదాడికి దిగుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
దాదాపు 34 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌ను గెలుపొంది వెస్టిండీస్ టీమ్ చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విండీస్ టీమ్ 2-1 తేడాతో పాకిస్థాన్ జట్టుపై గెలుపొందింది. బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది.
దేశ విభజన భారత చరిత్రలో విషాదకరమైన అధ్యాయం అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ 'పార్టీషన్ హర్రర్స్ రిమంబరెన్స్ డే' నాడు ఆయన.. పాకిస్థాన్ విడిపోయిన సందర్భంలో జరిగిన మారణహోమాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్ భవిష్యత్తులో సూపర్ రిచ్ దేశాల జాబితాలో చేరనుంది. ఇటీవల నివేదికల ప్రకారం ఈ దేశంలో దాదాపు $3 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ విలువ చేసే అరుదైన ఖనిజ సంపద దాగి ఉందట. ఇవి పాకిస్తాన్ దేశ విధానాన్ని మార్చనున్నాయి.
కీలకమైన ఖనిజాలు, హైడ్రోకార్బన్ల రంగాలలో పాకిస్తాన్‌కు సహకరిస్తామని అమెరికా ప్రకటించింది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవాన ఈ ఆఫరిచ్చింది. ఏదో ఒక రోజు ఇస్లామాబాద్.. న్యూఢిల్లీకి చమురును విక్రయించవచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఊతమిచ్చేలా..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదని, మా వద్ద బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
శత్రువుకు తిరుగులేని గుణపాఠం చెబుతామంటూ పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ తిప్పికొట్టారు. ఇలాంటి బెదిరింపులు భారత్ విషయంలో ఎంతమాత్రం పనిచేయవని అన్నారు.
సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పాక్ నేతలు తమ నోటికి పని చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై పాక్ ప్రధాని మాట్లాడుతూ భారత్‌కు మర్చిపోలేని విధంగా గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.