Yunus Gift To Pak General: పాకిస్థాన్‌కు వివాదాస్పద గిఫ్ట్.. భారత్‌పై విషం చిమ్మిన యూనుస్
ABN , Publish Date - Oct 27 , 2025 | 09:50 PM
యూనస్ బంగ్లా తాత్కాలిక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాక్‌కు చేరువవుతూ చైనాకు వంతపాడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్‌పర్సన్ జనరల్ సాహిర్ షంపాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు.
ఢాకా: ఈశాన్య భారత రాష్ట్రాలపై పదేపదే విషం కక్కే బంగ్లాదేశ్ (Bangladesh తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ (Muhammad Yundus) మరోసారి వివాదం రేపారు. వక్రీకరించిన బంగ్లా మ్యాప్‌ను పాక్ సైనిక ఉన్నతాధికారికి బహుకరించారు. ఈ మ్యాప్‌లో భారత భూభాగానికి చెందిన అసోం, తదిర ఈశాన్య ప్రాంతాలను బంగ్లాదేశ్‌లో భాగంగా చిత్రీకరించారు.
యూనస్ బంగ్లా తాత్కాలిక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాక్‌కు చేరువవుతూ చైనాకు వంతపాడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్‌పర్సన్ జనరల్ సాహిర్ షంపాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు. యూనస్-మీర్జా భేటీ సందర్భంగా 'Art of Triumph: Bangladesh's new dawn' అనే పుస్తకాన్ని మీర్జాకు యూనుస్ బహూకరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను యూనుస్ ట్వీట్ చేశారు. ఈ బుక్ కవర్ పేజీపై వక్రీకరించిన బంగ్లా మ్యాప్ ఉంది. భారత్‌కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు ఇందులో చోటుచేసుకున్నాయి 2024 సంవత్సరం జూలైలో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమంపై ఈ బుక్ రాశారు. నాటి విద్యార్థుల హింసాత్మక నిరసనలతోనే షేక్ హసీనా సర్కార్ కూలిపోయింది.
భారతదేశ ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అని అంటారు. ఇటీవల చైనాలో పర్యటించిన యూనుస్ ఈ ప్రాంతంలో తామే సముద్ర రక్షకులమని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని విస్తరించాలని, బంగ్లేదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని కూడా వ్యాఖ్యానించారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ నెక్ కారిడార్ అనేది బంగ్లా, భూటాన్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్‌తో బిమ్‌స్టిక్ కూటమిలోని దేశాలకు కనెక్టివిటీ హబ్ అని తెలిపారు. నేపాల్, భూటాన్, మయన్మార్, భారత్ మీదుగా బంగ్లా వస్తువులను చేరవేసే ట్రాన్‌షిప్‌మెంట్ ఒప్పందాన్ని కూడా భారత్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఏడు ఈశాన్య రాష్ట్రాలున్న బంగ్లా మ్యాప్‌ను పాక్ సైనికాధికారికి యూనుస్ బహుకరించడం మరోసారి వివాదాస్పదమైంది. దీనిపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
చైనా-అమెరికా రాజీ.. 100% టారిఫ్ ముప్పు లేనట్టే..
చైనా వెళ్లే వారికి గుడ్ న్యూ స్.. ఐదేళ్ల తర్వాత తొలి ఫ్లైట్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి