Aamir Jamal Loses Newborn: పాకిస్థాన్ క్రికెటర్ ఇంట తీవ్ర విషాదం
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:36 PM
పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఆమిర్ జమాల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంటల క్రితమే పుట్టిన జమాల్ కుమార్తె మరణించింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చనిపోక ముందు బిడ్డ తన చేతి వేళ్లను పట్టుకున్న ఫొటోలను షేర్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఆమిర్ జమాల్(Aamir Jamal) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంటల క్రితమే పుట్టిన జమాల్ కుమార్తె మరణించింది. ఈ విషయాన్ని జమాలే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చనిపోక ముందు బిడ్డ తన చేతి వేళ్లను పట్టుకున్న ఫొటోలను షేర్ చేశాడు.
'అల్లా దగ్గరి నుంచి వచ్చి, తిరిగి అల్లానే చేరుకుంది. నిన్ను ఎక్కువ సేపు మా దగ్గర ఆపలేకపోయాను చిట్టి తల్లి. మేము నిన్ను చాలా మిస్ అవుతాము. స్వర్గంలో గొప్ప స్థితిలో నీవు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ తన బేబీ ఫోటో షేర్ చేస్తూ బాధను వ్యక్తం చేశాడు. ఇక ఈ పోస్టుకు నెట్టింట్లో విపరీతమైన స్పందన వస్తోంది. బిడ్డను కోల్పోయిన బాధలో జమాల్ పెట్టిన సందేశం(Aamir Jamal loses newborn) నెటిజన్లను కలిచి వేస్తోంది. ప్రాంతాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులు జమాల్‌ను ఓదారుస్తున్నారు. జమాల్(Pakistan all rounder) ఇటీవలే పీసీబీ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. ఆ బాధలో ఉండగానే అంతకు మించిన బాధాకరమైన సంఘటన తాజాగా చోటుచేసుకుంది. దీంతో జమాల్ కు ఈ కష్టాలు ఏంటంటూ.. పాక్ లోని కొందరు అతడికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక జమాల్ (Pakistan all rounder)క్రికెట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అతను పాకిస్థాన్ దేశవాళీ టోర్నీ 'క్వైడ్ ఈ అజమ్' ట్రోఫీలో ఆడుతున్నాడు. 28 ఏళ్ల జమాల్ పాక్ తరఫున 8 టెస్ట్‌లు, 3 వన్డేలు, 6 టీ20లు ఆడి మొత్తంగా 26 వికెట్లు తీశాడు. టెస్టుల్లో రెండు హాఫ్ సెంచరీల సాయంతో 352 పరుగులు, వన్డేల్లో 5, టీ20ల్లో 88 పరుగులు చేశాడు. కుడి చేతి వాటం పేసర్ అయిన జమాల్ 2022లో టీ20ల ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది సిడ్నీలో ఆస్ట్రేలియా(Australia)పై అతను చేసిన 82 పరుగుల ఇన్నింగ్స్ హైలైటైంది. జమాల్ ఫస్ట్ క్లాస్ కెరీర్ కూడా చాలా బాగుంది. 40 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు తీసి, 1103 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడి.. వెలుగులోకి భీకర దృశ్యాలు..
కర్ణాటకలో కామరాజ్ ప్లాన్.. కాంగ్రెస్ కసరత్తు