Home » Nellore
నెల్లూరు జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. ఈ సంఘటన విడలూరు మండలం ముదివర్తి గ్రామంలో జరిగింది. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
YCP: 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ.. 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయంపాలైంది. కేలవం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఈ క్రమంలో అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో...
కడప వేదికగా మహానాడు సూపర్ సక్సెస్‌ను వైసీపీ, ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ చేపట్టిన సంస్కరణలు చూసి ఓర్వలేని స్థితికి ఆ పార్టీ దిగజారిందని మండిపడ్డారు.
నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన భానుప్రకాష్ ఎటూరి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన 2003లో ఐఏఎస్ బ్యాచ్‌లో చేరి, ఆంధ్రజ్యోతి విలేకరిగా పని చేసిన అనుభవం కలిగినవారు.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి కోర్టు రిమాండ్ విధించింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
Kakani Arrest:బెంగళూరులో అరెస్టు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో అక్రమంగా కార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరక్కుండా రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఆదివారం బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాణిని బెంగళూరు శివార్లలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయనపై ఎస్టీల బెదిరింపులు, ఫోర్జరీ కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది.
Kavali CI Overaction: జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి... కొంత మందితో కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం పైలాన్‌ను విధ్వంసం చేశారు. ఈ కేసులో రామిరెడ్డి ఏ8 నిందితుడిగా ఉన్నారు.
నెల్లూరు జిల్లా ఆమంచర్లలో బంధువు ఏడాదిగా 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతిగా తేలడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు.
విశాఖ, నెల్లూరు, ఆత్మకూరులో తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి. భారీగా పాల్గొన్న ప్రజలు 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు.