Share News

Anam Ramanarayana: ఆత్మకూరు - ముంబై హైవేపై ప్రమాదాలు.. ఆనం ఏమన్నారంటే

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:29 PM

Anam Ramanarayana: 2004 జూన్ నాటికి ఏడాది కాలంలో 22 ప్రమాదాలు జరిగాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన చర్యల వల్ల ఈ ఏడాది జూన్ నాటికి 10 ప్రమాదాలు జరిగాయని... ప్రమాదాలని పూర్తిగా నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.

Anam Ramanarayana: ఆత్మకూరు - ముంబై హైవేపై ప్రమాదాలు.. ఆనం ఏమన్నారంటే
Anam Ramanarayana Reddy

నెల్లూరు, జూన్ 21: జిల్లాలోని ఆత్మకూరు సమీపంలో ముంబాయి హైవేపై ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు క్షతగాత్రులుగా నిలిచింది. ఆ ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) ఈరోజు (శనివారం) అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కృష్ణపట్నం పోర్టు - ముంబాయి జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని.. అధికారులతో స్వయంగా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర అధికారులతో కలిసి చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.


2004 జూన్ నాటికి ఏడాది కాలంలో 22 ప్రమాదాలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన చర్యల వల్ల ఈ ఏడాది జూన్ నాటికి 10 ప్రమాదాలు జరిగాయని... ప్రమాదాలని పూర్తిగా నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఆత్మకూరు సర్కిల్‌లో నాలుగు పోలీస్‌స్టేషన్‌ల కింద 2024లో 68 ప్రమాదాల్లో 37 మంది మృతిచెందారని.. ఈ ఏడాది 27 ప్రమాదాల్లో 16 మంది చనిపోయారని తెలిపారు.


ఏపీ వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నేతృత్వంలో సాధ్యమైందన్నారు. భవిష్యత్తుతరాలకి ఆరోగ్య ఏపీని అందించే అవకాశం కలిగిందని అన్నారు. ఆదాయం లేని ఆలయాలకు దేవాదాయశాఖ నుంచి నెలకు రూ.10వేలు చొప్పున 5600 ఆలయాలకు ఇస్తున్నామన్నారు. మరిన్ని ఆలయాలను ఈ జాబితాలో చేరుస్తున్నామని... 481 ఆలయాలకు కూడా ఇస్తున్నామని చెప్పారు. అర్చకులకు గతంలో రూ.10 వేలు సంభావనని రూ.15వేలుకు పెంచామన్నారు.


ఆలయాల కమిటీలు వేయడానికి రూ‌.5 లక్షల నుంచి రూ‌.25 లక్షలలోపు ఆదాయం ఉన్న వాటిని గుర్తించామన్నారు. కమిటీలో బ్రాహ్మణులు, నాయుబ్రాహ్మణలు ఉంటారన్నారు. పురాతన ఆలయాల పునర్నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. 600 మంది వేద పండితులకు నెలకు రూ.3వేలు చొప్పున ఇస్తున్నామన్నారు. ప్రధానమైన 21 ఆలయాల్లో నిత్య అన్నప్రసాదం కొనసాగుతుందని మంత్రి ఆనం రామనారాయాన రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

విజయవాడ ఆస్పత్రికి చెవిరెడ్డి.. ఏమైందంటే

సరికొత్త చరిత్ర.. యోగా డేపై సీఎం చంద్రబాబు

యోగా గ్రాండ్ సక్సెస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

Read latest AP News And Telugu News

Updated Date - Jun 21 , 2025 | 03:53 PM