Home » Nellore City
అధికార వైసీపీకి ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే కాదు.. వాలంటీర్లు సైతం గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అలాగే వందలాది మంది వాలంటీర్లు సైతం ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు.
నెల్లూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ సర్కార్ ఇష్టానుసారం చేస్తోంది. ఎవరు ఏమనుకున్నా.. ఏమైపోయినా సరే మనకేంటి.. కావాల్సిందల్లా 2024 గెలుపు మాత్రమే..? ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడట్లేదు..
AP Elections 2024 : అనిల్ కుమార్ యాదవ్.. (Anil Kumar Yadav) నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.. అయితే ఈ ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాతో క్లియర్ కట్‌గా తేలిపోయింది. వైసీపీ (YSRCP) హైకమాండ్ అనిల్‌ను ఎందుకు ఇక్కడ్నుంచి పోటీ చేయిస్తోందో..? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే సంగతి దేవుడెరుగు..? అవన్నీ ఇక్కడ అనవసరం. అనిల్ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు..? సీఎం జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మనసులో ఎవరున్నారు..? అనేది ఇప్పుడు నెల్లూరు సిటీలో (Nellore City) జరుగుతున్న చర్చ..
అవును.. మీరు వింటున్నది నిజమే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ (Ponguru Narayana) ఇంటికి వైసీపీ నేతలు (YSRCP Leaders) క్యూ కడుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడంతో వైసీపీ అధిష్టానం షాక్‌కు గురైంది. అసలు విషయానికొస్తే..
అనిల్ వ్యతిరేక వర్గీయులుగా ముద్ర పడ్డ రూప్‌కుమార్, ముక్కాల ద్వారకానాథ్‌లు పార్టీలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనిల్ వ్యవహారశైలి ఏ మాత్రం మింగుడుపడని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు రూప్‌కుమార్ తదితరులకు ఆశీస్సులందిస్తున్నారు.
ఓ వైపు పెరుగుతున్న తిరుగుబాట్లు.. మరోవైపు ఎంత ప్రయత్నించినా తిరుగుబాటుదార్లపై పడని వేటు.. ఈ రెండూ నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను కుంగదీస్తున్నాయి. ఒకప్పుడు సీఎం జగన్‌కు వీర విధేయుడిగా ఉన్న అనిల్ మాట ఇప్పుడు చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది.
మండలంలో జరుగుతున్న భూముల రీసర్వేను మంగళవారం జాయింట్ కలెక్టరు కూర్మనాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వల్లూరు, మల్లూరు గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వే పనులను పరిశీలించారు.
వవ్వేరు బ్యాంకులో జరిగిన వరుస కుంభకోణాల్లో భాగస్వాములెవరు? ఎంతెంత వాటాలు పంచుకున్నారో కోవూరు ఎమ్మెల్యే తేల్చాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.