Share News

AP Politics: అనిల్ స్థానంలో ‘సిటీ’ నుంచి పోటీ చేసేదెవరు.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా..!?

ABN , Publish Date - Feb 01 , 2024 | 09:41 PM

AP Elections 2024 : అనిల్ కుమార్ యాదవ్.. (Anil Kumar Yadav) నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.. అయితే ఈ ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాతో క్లియర్ కట్‌గా తేలిపోయింది. వైసీపీ (YSRCP) హైకమాండ్ అనిల్‌ను ఎందుకు ఇక్కడ్నుంచి పోటీ చేయిస్తోందో..? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే సంగతి దేవుడెరుగు..? అవన్నీ ఇక్కడ అనవసరం. అనిల్ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు..? సీఎం జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మనసులో ఎవరున్నారు..? అనేది ఇప్పుడు నెల్లూరు సిటీలో (Nellore City) జరుగుతున్న చర్చ..

AP Politics: అనిల్ స్థానంలో ‘సిటీ’ నుంచి పోటీ చేసేదెవరు.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా..!?

అనిల్ కుమార్ యాదవ్.. (Anil Kumar Yadav) నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.. అయితే ఈ ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాతో క్లియర్ కట్‌గా తేలిపోయింది. వైసీపీ (YSRCP) హైకమాండ్ అనిల్‌ను ఎందుకు ఇక్కడ్నుంచి పోటీ చేయిస్తోందో..? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే సంగతి దేవుడెరుగు..? అవన్నీ ఇక్కడ అనవసరం. అనిల్ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు..? సీఎం జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మనసులో ఎవరున్నారు..? అనేది ఇప్పుడు నెల్లూరు సిటీలో (Nellore City) జరుగుతున్న చర్చ. ఇక్కడ్నుంచి పోటీ చేయడానికి ఎవరెవరు రంగం సిద్ధం చేసుకున్నారు..? జగన్ పరిశీలనలో ఎవరెవరున్నారు..? టీడీపీ హైకమాండ్ ఏమనుకుంటోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


anil-kumar.jpg

ఇదీ అసలు సంగతి..!

నెల్లూరు సిటీలో మొదట్నుంచీ రెడ్డి సామాజిక వర్గానిదే పైచేయి. 1972 నుంచీ ఇక్కడ ఆ సామాజిక వర్గానిదే పెత్తనం. 2014, 2019 ఎన్నికల్లో మాత్రమే సీన్ మారింది. వైసీపీ తరఫున రెండుసార్లు అనిల్ కుమార్ యాదవ్ పోటీచేసి గెలుపొందారు. బీసీ సామాజిక వర్గం, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో దీన్ని క్యాష్ చేసుకున్న జగన్ రెండు పర్యాయాలు సీటిచ్చి అనిల్‌ను గెలిపించుకున్నారు కానీ.. 2024లో మాత్రం పరిస్థితి సర్లేదు. ఎలాగో గెలిచే సీటే కదా అని అతిగా ఆలోచించి అనిల్‌కు స్థానం చలనం చేసిందో లేకుంటే.. మరొకటి ఆశించి హైకమాండ్ ముందుకెళ్లిందో తెలియట్లేదు కానీ.. నియోజకవర్గంలో మాత్రం చిత్ర విచిత్రాలుగా వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. అయితే.. ఈసారి టీడీపీ తరఫున మాజీ మంత్రి నారాయణ పోటీచేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతున్నారన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అనిల్‌ను అధిష్టానం సైడ్ చేయడంతో పక్కా సీటు తమదేనని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఓడిపోయే మొదటి సీటు సిటీయేనని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.


Vemireddy-Prasanthi.jpg

జగన్ మనసులో ఎవరున్నారు..?

నారాయణ.. ఆర్థికంగా, రాజకీయంగా అంతకుమించి మంచి పేరున్న వ్యక్తి. దీంతో ఇక్కడ్నుంచి ఎవర్ని బరిలోకి దింపితే బాగుంటుందని వైసీపీ హైకమాండ్ సర్వేలు చేయించిందట. ఇవన్నీ నిశితంగా పరిశీలించిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని జగన్ నిర్ణయించారట. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరును జగన్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు తెలియవచ్చింది. వేమిరెడ్డి కుటుంబానికి జిల్లాలో కాస్తో కూస్తో పేరుండటం, సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉండటం, ఆర్థిక నేపథ్యాన్ని పరిగణనలోనికి తీసుకుని ఆమెకు టికెట్ కేటాయించడానికి హైకమాండ్ రంగం సిద్ధం చేసిందట. ఎందుకంటే.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ పదవీకాలం రెండు, మూడు నెలల్లో ముగియనుంది. ఆయన నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీచేస్తున్నారు. దీంతో అదే పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నెల్లూరు సిటీ నుంచి ప్రశాంతిని నిలబెడితే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని అధిష్టానం యోచిస్తోందట.

Rup-Kumar-Yadav.jpg

వద్దన్నో.. వద్దు..!

వాస్తవానికి అనిల్ తర్వాత ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్.. నియోజకవర్గానికి అన్నీ తానై చూసుకున్నార్న విషయం తెలిసిందే. ఇంత చేసినా తనను పట్టించుకోలేదని.. తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఎన్నోసార్లు అబ్బాయ్ వర్సెస్‌ బాబాయ్‌గా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే అనిల్ మాత్రం.. బాబాయ్ రూప్‌కు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారట. ‘ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను మార్చేశారుగా.. కనీసం నా సిట్టింగ్ సీటులో నేను చెప్పిన వారికి ఇవ్వండి అన్నా.. నా తర్వాత చూసుకున్నది బాబాయ్.. పరిచయం లేని వ్యక్తులకు ఇచ్చి చేజేతులారా సీటు పోవడం నాకిష్టం లేదు’ అని జగన్‌కు అనిల్ మొరపెట్టుకున్నారట. అయితే జగన్ మాత్రం ప్రశాంతి రెడ్డికే సీటు కేటాయించాలని దాదాపు ఫిక్స్ అయ్యారట. రేపొద్దున తన భార్యకు టికెట్ ఇస్తేనే తాను ఎంపీగా పోటీచేస్తానని వేమిరెడ్డి.. బాబాయ్‌కు టికెట్ ఇస్తేనా తానూ ఎంపీ పోటీచేస్తానని అనిల్ గట్టిగా అనుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. దీంతో.. సిటీ సీటు విషయంలో వైసీపీ తర్జన భర్జన పడుతోందట. ఫైనల్‌గా ఏం తేలుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


AP Politics: రోజా ఒంగోలు ఎంపీగా పోటీచేస్తే.. ‘నగరి’ పరిస్థితేంటి.. ఇక్కడ్నుంచి పోటీ ఎవరు..!?


YSRCP: మాకొద్దు బాబోయ్.. అని దండం పెట్టిన అలీ, వినాయక్.. తెరపైకి సుమన్!

Updated Date - Feb 01 , 2024 | 09:54 PM