YSRCP Vs TDP : వైఎస్ జగన్‌కు ఝలక్.. మాజీ మంత్రి నారాయణ ఇంటిబాట పడుతున్న వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2023-07-27T12:24:25+05:30 IST

అవును.. మీరు వింటున్నది నిజమే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ (Ponguru Narayana) ఇంటికి వైసీపీ నేతలు (YSRCP Leaders) క్యూ కడుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడంతో వైసీపీ అధిష్టానం షాక్‌కు గురైంది. అసలు విషయానికొస్తే..

YSRCP Vs TDP : వైఎస్ జగన్‌కు ఝలక్.. మాజీ మంత్రి నారాయణ ఇంటిబాట పడుతున్న వైసీపీ నేతలు

అవును.. మీరు వింటున్నది నిజమే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ (Ponguru Narayana) ఇంటికి వైసీపీ నేతలు (YSRCP Leaders) క్యూ కడుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడంతో వైసీపీ అధిష్టానం షాక్‌కు గురైంది. అసలు విషయానికొస్తే.. గత కొన్నిరోజులుగా నెల్లూరు సిటీ (Nellore City) ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు (MLA Anil Kumar Yadav).. ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ (Roop Kumar Yadav) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘బాబాయ్ తగ్గడు.. అబ్బాయ్ ఆగడు’ (Babai-Abbai) అన్నట్లుగా నియోజకవర్గంలో ఉంది.!. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో అనిల్‌కు టికెట్ ఇవ్వకుండా అధిష్టానం.. రూప్‌ కుమార్‌కు ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అటు అనిల్‌ను కాదనలేక.. ఇటు రూప్‌తో విబేధించలేక నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు, ద్వితియ శ్రేణి నేతలు డైలమాలో పడిపోయారు.


EX-Minister-Narayana.jpg

దారులన్నీ నారాయణ ఇంటివైపే..!

వైసీపీలో వర్గపోరును తట్టుకోలేక ఒక్కొక్కరుగా నియోజకవర్గానికి చెందిన కీలక, ముఖ్య నేతలు అధికార పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వైసీపీ నేతలు.. టీడీపీ తీర్థం పుచ్చుకవడానికి సిద్ధమైపోయారు. మాజీ మంత్రి నారాయణ ఇంటికి పలువురు వైసీపీ ముఖ్యులు, కార్పొరేటర్లు చేరుకుని పసుపు పార్టీలో చేరడంపై చర్చిస్తున్నారు. గురువారం ఉదయం నారాయణ నివాసానికి వెళ్లిన వైసీపీ కార్పోరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ సుమారు 20 నిమిషాలు పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. దీంతో టీడీపీలోకి వెళ్లబోతున్నారంటూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. బొజ్జలతో పాటు పలువురు సీనియర్ నేతలు, ముఖ్యులు త్వరలోనే టీడీపీ అధినేత చ్రందబాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకుంటారని తెలుస్తోంది.

jagan-anil-and-Roop.jpg

బాబాయ్ వర్సెస్ అబ్బాయ్..!

2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ నుంచి వైసీపీ తరఫున అనిల్, టీడీపీ తరఫున నారాయణ పోటీ చేశారు. బాబాయ్ రూప్ సహకారంతో అతి కష్టమ్మీద అనిల్ గట్టెక్కారు. నారాయణకు 73,052 ఓట్లు రాగా.. అనిల్‌కు 75,040 ఓట్లు వచ్చాయి. అంటే.. 1,988 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి గెలిచారన్న మాట. నాటి మంత్రిపై గెలవడం, సామాజిక సమీకరణల పరిగణనలోనికి తీసుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి అనుభవం లేని అనిల్‌కు నీటి పారుదల శాఖ కట్టబెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే బాబాయ్ రూప్‌తో అనిల్‌కు పడట్లేదు. అలా రెండు వర్గాలుగా విడిపోయి.. కనిపించినా, ఎక్కైడనా ఎదురుపడితే చాలు కొట్టుకునేంత పరిస్థితికి విబేధాలొచ్చాయి. ఆ మధ్య ఇద్దరినీ కలిపి.. విబేధాలకు వైఎస్ జగన్ రెడ్డి చెక్ పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది.

Anil-Ku,ar.jpg

నలిగిపోతున్న క్యాడర్..!

అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు రూప్ ఏం చెప్పినా నడిచేవి. అయితే.. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒకరిపై ఒకరు మీడియా ముందే విమర్శలు గుప్పించుకుంటున్న పరిస్థితి. గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి అబ్బాయ్ మళ్లీ గొంతు పెంచగా.. బాబాయ్ అస్సలు తగ్గే ప్రసక్తే లేదన్నట్లుగా విమర్శించుకుంటున్నారు. అయితే.. సీఎం చెబితే కలిసి పనిచేస్తానని రూప్ చెబుతుండగా రాజీపడే ప్రసక్తే లేదని అబ్బాయ్ చెబుతున్నాడు. ఈ ఇద్దరు కలిస్తేనే సిటీలో గెలవడం ఈజీ అని.. లేకుంటే ఇద్దరి మధ్య గొడవలతో క్యాడర్ ఉండటం కష్టమేనని నేతలు చెబుతున్నారు. ఈ గొడవలతో క్యాడర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఉండటం అనవసరమని భావించి టీడీపీ వైపు నేతలు అడుగులు వస్తున్నారు. ఇందులో భాగంగానే నారాయణతో పలువురు వైసీపీ నేతలు చర్చించడం జరిగింది. అతి త్వరలోనే వీరితో పాటు మరికొందరు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


Rains lash Hyderabad : వర్షానికి బండి ఆగిపోయిందా.. వెంటనే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి..


Target Kuppam : కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ పదే పదే చెప్పడం వెనుక ఇంత కుట్ర దాగుందా.. బాగోతం బట్టబయలు..!


Rain Fury Continues In Telangana : డేంజర్‌ జోన్‌లో కడెం ప్రాజెక్ట్.. పరుగులు తీసిన ఎమ్మెల్యే, అధికారులు, దేవుడే కాపాడాలన్న మంత్రి!


Telugu States : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రం కీలక ప్రకటన


YSRCP : వైఎస్ జగన్‌కు మరో తలనొప్పి.. మంత్రి వర్సెస్ ఎంపీ.. ఫొటో తెచ్చిన తంట..!


YSRCP : నందిగామ సురేష్‌కు ఎంపీ టికెట్ ఇవ్వనని వైఎస్ జగన్ చెప్పేశారా.. యువనేత స్థానంలో ఎవరంటే..!?


TS Schools : తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. టైమింగ్స్ మారాయ్..


Rains lash Telangana : తెలంగాణలో మూడ్రోజులపాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..!?


Telangana Rain Alert : తెలంగాణ ప్రజలారా.. ఈ మూడ్రోజులు జాగ్రత్త.. భారీ నుంచి అతి భారీ వర్షాలు


Telangana Weather Updates : తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు


Updated Date - 2023-07-27T12:37:23+05:30 IST