TS Schools : తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. టైమింగ్స్ మారాయ్..

ABN , First Publish Date - 2023-07-24T20:23:55+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్ల టైమింగ్‌లో (School Timings) మార్పులు చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై..

TS Schools : తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. టైమింగ్స్ మారాయ్..

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్ల టైమింగ్‌లో (School Timings) మార్పులు చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై.. ప్రాథమిక పాఠశాలలు అనగా 1వ తరగతి నుంచి 5 వరకు (1st Class To 5th Class) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంట వరకూ స్కూళ్లు ఉంటాయి. అప్పర్ ప్రైమరీ (ప్రాథమికోన్నత పాఠశాలలు) అనగా 6వ తరగతి నుంచి 10 వరకు (6 to 10th Class) స్కూళ్లు 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని ప్రైమరీ స్కూళ్లు కూడా ఇదే సమయాన్ని పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.


Half-Day-Schools-in-Telanga.jpg

తక్షణమే అమలు..!

కాగా.. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఈ టైమింగ్స్ పాటించాలని కేసీఆర్ సర్కార్ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ సోమవారం రాత్రే పంపించింది. మరోవైపు.. డీఈవోలు, ఆర్‌జేడీఎస్ఈల పరిధిలోని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల సమయాల్లో చేసిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే.. మంగళవారం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయన్న మాట.

School-Timings.jpg

ఇదివరకు ఇలా..!

అయితే ఇప్పటి వరకూ తెలంగాణలోని స్కూళ్లు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నడిచేవి. తాజాగా మారిన టైమింగ్స్ ప్రకారం ప్రైమరి స్కూళ్లకు ఉదయం అరగంట ఆలస్యంగా స్కూళ్లు మొదలై సాయంత్రం పావు గంట ఆలస్యంగానే ముగియనున్నాయి. ఇక అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ ఉదయం అరగంట ఆలస్యంగా ప్రారంభమై.. సాయంత్రం 45 నిమిషాలు ఆలస్యంగా పాఠశాలలు ముగియనున్నాయి. కాగా.. రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు, చేర్పులు చేయాలని గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే.

ap-govt-schools.jpg


ఇవి కూడా చదవండి


Rains lash Telangana : తెలంగాణలో మూడ్రోజులపాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..!?


Telangana Rain Alert : తెలంగాణ ప్రజలారా.. ఈ మూడ్రోజులు జాగ్రత్త.. భారీ నుంచి అతి భారీ వర్షాలు


Telangana Weather Updates : తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు


TS Schools : విద్యార్థులకు తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్.. అదేంటో తెలిస్తే..!


Pension Hike In TS : శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. పింఛన్ పెరిగింది.. ఒకేసారి..


Rains lash Telangana : వదలనంటున్న వర్షాలు.. తెలంగాణలో రేపు, ఎల్లుండి సెలవులు..!?


Updated Date - 2023-07-24T20:45:30+05:30 IST