Home » Narendra Modi
నేను శివుని భక్తుడిని, విషం అంతా మింగేస్తాను. కానీ ఇతరులను అవమానిస్తే మాత్రం సహించలేనని ప్రధాని మోదీ అన్నారు. అస్సాంలోని దరాంగ్ పర్యటన సందర్భంగా పేర్కొన్నారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
దేశానికి నాలుగోసారీ ప్రధానిగా నరేంద్రమోదీనే ఉంటారని సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే దశాబ్దంలో ఏపీతోపాటు, దేశంలో అద్భుతాలు జరుగుతాయన్నారు. ఒక సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలని..
ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్‌కు సంఘీభావం తెలిపారు. సమస్యలకు చర్చలే పరిష్కారమని స్పష్టం చేశారు. ఖతర్ సార్వభౌమత్వ ఉల్లంఘనను ఖండిస్తున్నట్టు తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతిస్థాపనకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు.
అమెరికా కాటన్ దిగుమతులపై 2025 డిసెంబర్ 31 వరకూ 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఈ చర్యతో స్థానిక రైతులు ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారని, అమెరికా రైతులు సంపన్నులు అవుతారని అన్నారు.
మాక్రాన్‌తో సంభాషణల వివరాలను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధాని మోదీ పంచుకున్నారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో చక్కటి సంభాషణలు జరిగాయని, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించామని చెప్పారు.
మోదీ తనకెప్పటికీ ఫ్రెండేనన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్‌పై భారత ప్రధాని తాజాగా స్పందించారు. తనదీ ఇదే భావన అని అన్నారు. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, అభివృద్ధికారక భాగస్వామ్యం ఉందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో చైనా విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో మోదీ, పుతిన్‌ల బంధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరకాల స్నేహితులు ఒకే చోట కలుసుకోగానే ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు.
పరస్పర విశ్వాసయం, గౌరవం, సహృదయతే భారత్ చైనా బంధంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు జెన్‌పింగ్‌తో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా జెలన్‌స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రస్తావన తెచ్చారు. దేశంలోని పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.