Share News

CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి గ్లోబల్ సమ్మిట్‌ ఆహ్వానం

ABN , Publish Date - Dec 02 , 2025 | 08:59 AM

ఈ రాత్రి 8 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. తిరిగి రేపు రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు.

CM Revanth: నేడు ఢిల్లీకి  సీఎం రేవంత్ రెడ్డి..   ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి గ్లోబల్ సమ్మిట్‌ ఆహ్వానం
CM Revanth Reddy Delhi Visit

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (డిసెంబర్ 2) రాత్రి 8 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు (డిసెంబర్ 3) ఉదయం నుంచి సీఎం హై-ప్రొఫైల్ భేటీల షెడ్యూల్‌లో ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇంకా పలువురు కేంద్ర మంత్రులను కలిసి.. హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్-2026కు అధికారికంగా ఆహ్వానం పత్రిక అందజేయనున్నారు.


ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించి, తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే దేశ రాజకీయ నాయకత్వం మొత్తాన్నీ ఒకే వేదికపై చేర్చేందుకు సీఎం రేవంత్ స్వయంగా ఢిల్లీలో పర్యటిస్తారు. అదనంగా కొన్ని కేంద్ర పథకాలు, రాష్ట్రానికి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రేపంతా ఢిల్లీలోనే గడిపి, సీఎం రేవంత్ రెడ్డి, రాత్రి హైదరాబాద్ తిరిగి వస్తారని సమాచారం.


ఇవీ చదవండి:

ఐటీ రిఫండ్స్‌ ఇంకా రాలేదా? అయితే..

ప్రమోషనల్‌ స్కీములపై జీఎస్‌టీ ఉంటుందా?

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 02 , 2025 | 09:02 AM