Share News

Income Tax Refunds Delay: ఐటీ రిఫండ్స్‌ ఇంకా రాలేదా

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:55 AM

పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించిన చాలా మందిలో ఇప్పుడు ఒకటే టెన్షన్‌. తమకు రావాల్సిన రిఫండ్‌ ఎప్పుడు వస్తుందా? అని. రిటర్నులు దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమై ఆయా వ్యక్తుల...

Income Tax Refunds Delay: ఐటీ రిఫండ్స్‌ ఇంకా రాలేదా

పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించిన చాలా మందిలో ఇప్పుడు ఒకటే టెన్షన్‌. తమకు రావాల్సిన రిఫండ్‌ ఎప్పుడు వస్తుందా? అని. రిటర్నులు దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమై ఆయా వ్యక్తుల రిఫండ్స్‌ మొత్తం వారి ఖాతాల్లో జమ అయ్యేది. అయితే ఈసారి మాత్రం రిఫండ్స్‌ ఆలస్యమవుతుండటంతో చాలా మందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ విషయంలో చాలా మంది తమ బాధను వెళ్లగక్కేందుకు సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు డిసెంబరు నెలాఖరు కల్లా రిఫండ్స్‌ ప్రక్రియను పూర్తి చేస్తామని ఐటీ శాఖ అంటోంది. ఇంతకీ ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నుంచి రావాల్సిన రిఫండ్స్‌ ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం. అంతేకాదు రిఫండ్‌ స్టేట్‌సతో పాటు ఎలా చెక్‌ చేసుకోవాలో తెలుసుకుందాం.

ఎవరు అర్హులు?

టీడీఎస్‌, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ లేదా సెల్ఫ్‌ అసె్‌సమెంట్‌ ద్వారా చెల్లించాల్సిన పన్ను కంటే అధిక ఆదాయ పన్ను చెల్లించిన ఆదాయ పన్ను చెల్లింపుదారులు అందరూ ఐటీ రిఫండ్స్‌కు అర్హులు.

ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్‌ 143 (1) ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసిన తొమ్మిది నెలల్లోగా ఐటీ శాఖ ఐటీ రిటర్నుల ప్రాసెసింగ్‌ పూర్తి చేయాలి. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే నెలాఖరు వరకు ఇందుకు గడువు ఉంది. అయితే ఎప్పటిలోగా రిఫండ్‌ ప్రక్రియ పూర్తి చేయాలనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల ఫైలింగ్‌ ఈ ఏడాది సెప్టెంబరు 16తో ముగిసింది. దీంతో ఐటీ శాఖ ఈ ఏడాది డిసెంబరులోగా రిటర్నుల ప్రాసెసింగ్‌ పూర్తి చేయాలి. అన్నీ సజావుగా ఉన్న రిఫండ్స్‌ క్లెయిమ్స్‌ను కూడా ఆ లోగానే పూర్తి చేస్తామని ఇటీవల సీబీడీటీ చీఫ్‌ రవి అగర్వాల్‌ ప్రకటించడం విశేషం.

కాలపరిమితి

ఆలస్యానికి కారణాలు

  • పెద్ద మొత్తంలో ఉన్న రిఫండ్స్‌ క్లెయిమ్స్‌ను సమగ్రంగా పరిశీలించాల్సి రావడం

  • కొన్ని రిటర్నుల్లో పేర్కొన్న అనుమానాస్పద డిడక్షన్లను ఐటీ అధికారులు వ్యక్తిగతంగా సమీక్షించాల్సి రావడం

  • కొన్ని రిటర్నుల్లో తప్పుడు లేదా అధిక డిడక్షన్లు పేర్కొనడం

  • రిఫండ్‌ జమ కావాల్సిన బ్యాంకు ఖాతా చెల్లుబాటులో లేకపోవడం

  • ఎలకా్ట్రనిక్‌ (ఈ)-వెరిఫికేషన్‌ పెండింగ్‌లో ఉండడం

  • ఐటీ శాఖ నోటీసులకు పన్ను చెల్లింపుదారులు సరిగా స్పందించక పోవడం

  • ప్రస్తుత రిఫండ్‌ క్లెయిమ్‌ను గత ఆర్థిక సంవత్సరానికి బాకీ ఉన్న పన్ను చెల్లింపునకు జమ చేయడం

వడ్డీతో

సహా

ఎలకా్ట్రనిక్‌ -వెరిఫికేషన్‌ పూర్తయిన వెంటనే రిఫండ్‌ ప్రక్రియ ప్రారంభమై మీ బ్యాంకు ఖాతాలో రిఫండ్‌ మొత్తం జమ అవుతుంది. అన్నీ సజావుగా ఉన్నా రిఫండ్‌ ఆలస్యమైతే, రిఫండ్‌ మొత్తంపై ఆర్థిక సంవత్సరం ప్రారం భం నుంచి నెలకు అర శాతం (0.5ు) చొప్పున వడ్డీ చెల్లిస్తారు. అయితే ఇది గడువులోగా ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. మిగతా వారికి రిటర్న్‌ ఫైల్‌ చేసిన గడువు నుంచి చెల్లిస్తారు.

ప్రక్రియ వేగవంతం చేయడం ఎలా?

  • ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో లాగినై రిఫండ్‌/రిటర్న్‌ స్టేటస్‌ తెలుసుకోవాలి

  • రిఫండ్‌.. బ్యాంకు ఖాతాలో జమ అయినది లేనిది చెక్‌ చేసుకోవాలి

  • నిర్దారణ కోసం ఐటీ శాఖ జారీ చేసే నోటీసులు, విజ్ఞప్తులకు వెంటనే స్పందించాలి

  • ఐటీ శాఖ పోర్టల్‌లోని ఈ-నివారణ్‌ సెక్షన్‌ ద్వారా మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకు రావాలి

  • ఫాలో అప్‌ కోసం ఐటీ శాఖకు చెందిన సీపీసీ హెల్ప్‌లైన్‌ ద్వారా సంప్రదించాలి

  • ప్రాసెసింగ్‌ పూర్తయిన తర్వాత కూడా సరైన కారణం లేకుండా రిఫండ్‌ ఆలస్యం చేస్తే హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయాలి

ఇవీ చదవండి:

విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

లాభాల స్వీకరణతో మార్కెట్లు డౌన్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2025 | 05:55 AM