Share News

GST On Promotional Schemes: ప్రమోషనల్‌ స్కీములపై జీఎస్‌టీ ఉంటుందా

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:52 AM

సద్గురు ఎలకా్ట్రనిక్స్‌ అనే సంస్థకు పలు పట్టణాల్లో మొబైల్‌ షోరూమ్స్‌ ఉన్నాయి. మార్కెట్లో ఎదురయ్యే పోటీని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది....

GST On Promotional Schemes: ప్రమోషనల్‌ స్కీములపై జీఎస్‌టీ ఉంటుందా

సద్గురు ఎలకా్ట్రనిక్స్‌ అనే సంస్థకు పలు పట్టణాల్లో మొబైల్‌ షోరూమ్స్‌ ఉన్నాయి. మార్కెట్లో ఎదురయ్యే పోటీని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.20,000 విలువ గల మొబైల్‌ కొనుగోలు చేస్తే రూ.3,000 విలువ చేసే ఒక లెదర్‌ బ్యాగ్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఇంకా కొన్ని రకాల ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల మీద ఒకటి కొంటే మరొకటి ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి గాను ఉచితంగా ఇచ్చే వస్తువులను సద్గురు ఎలకా్ట్రనిక్స్‌ పెద్దఎత్తున కొనుగోలు చేయటంతో పాటుగా వాటి మీద ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కూడా తీసుకుంది.

అయితే ఇక్కడ వీరికి వచ్చిన సమస్య ఏమిటంటే ఇలా ఉచితంగా ఇచ్చే వస్తువుల మీద జీఎ్‌సటీ చెల్లించాలా? లేదంటే సంబంధిత ఐటీసీ రివర్స్‌ చేయాల్సి ఉంటుందా? నిజానికి ఇలాంటి పథకాలను చాలా వ్యాపార సంస్థలు అమలు చేస్తూ ఉంటాయి. ఇంత మొత్తంలో బట్టలు కొనుగోలు చేస్తే గోల్డ్‌ కాయిన్‌ ఉచితం అని, అలాగే బంగారం కొనుగోలు చేసినప్పుడు వెండి ఉచితం అని చెబుతుంటారు. ఇవన్నీ ప్రమోషనల్‌ స్కీమ్స్‌ విభాగానికి చెందుతాయి. మరి వీటికి సంబంధించి జీఎ్‌సటీ నిబంధనలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం.

పన్ను చెల్లించాలా..?

ముందుగా ఉచితంగా ఇచ్చే వస్తువుల మీద జీఎ్‌సటీ చెల్లించాలా? ఏదేనీ అమ్మకం లేదా ఇతర లావాదేవీ, జీఎస్‌టీ కిందకు రావాలంటే ముందుగా అది ‘సరఫరా’ నిర్వచనంలోకి రావాలి. అలా రావాలంటే ఆ లావాదేవీకి సంబంధించి ఏదేనీ ‘మొత్తం’ అంటే డబ్బు లేదా ఇతర కన్సిడరేషన్‌ ఏదైనా సరఫరాదారునికి రావాలి. అప్పుడు మాత్రమే అది సరఫరా కిందకు వస్తుంది. అలాగే జీఎ్‌సటీ వర్తిస్తుంది. పైన తెలిపిన ఉదాహరణలో ఆయా వస్తువులను ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అది ‘సరఫరా’ కిందకు రాదు. దీంతో జీఎ్‌సటీ చెల్లించనవసరం లేదు. (అమ్మకందారుడికి, కొనుగోలుదారుడికి మధ్య ఇతర సంబంధ బాంధవ్యాలు ఏమైనా ఉంటే. అంటే ఈ ఇరువురు రిలేటెడ్‌ పర్సన్స్‌, డిస్టింక్ట్‌ పర్సన్‌ విభాగంలోకి వస్తే ఆ నిబంధనలు వేరే ఉంటాయి).


ఐటీసీ రివర్స్‌ చేయాలా?

ఇకపోతే, ఇలా ఉచితంగా ఇచ్చే వస్తువుల మీద తీసుకున్న ఐటీసీ రివర్స్‌ చేయాలా? ఇది మరొక సందేహం. జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం ఏదేనీ వస్తువును గిఫ్ట్‌ కింద ఉచితంగా ఇస్తే సంబంధిత ఐటీసీ రివర్స్‌ చేయాలి. మరి ఇలా ఇచ్చే వస్తువులు గిఫ్ట్‌ కింద భావించాలా అంటే, దీనికి ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది. ఒక వస్తువు కొన్నప్పుడు మరొక వస్తువు ఇవ్వటం అనేది గిఫ్ట్‌ కిందకు రాదు. ఎందుకంటే ఆ వస్తువును ఉచితంగా ఇచ్చినట్లు కనిపించినప్పటికీ.. మరొక వస్తువును కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఈ వస్తువును ఇవ్వటం జరుగుతుంది. అంటే, రెండు వస్తువులకు కలిపి బిల్‌ చేసినట్లు భావించాలి. కాబట్టి ఐటీసీ రివర్స్‌ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కొనుగోలుతో సంబంధం లేకుండా పూర్తి ఉచితంగా ఒక వస్తువును ఇస్తే అప్పుడు మాత్రమే ఐటీసీ రివర్స్‌ చేయాలి. అంటే మందుల తయారీదారులు.. డాక్టర్లకు ఉచిత శాంపిల్స్‌ ఇవ్వటం లాంటిది.

పైన చెప్పిన ఉదాహరణలో రూ.15,000 మొబైల్‌ కొనుగోలు చేస్తే ఒక బ్యాగ్‌ ఇవ్వటం అంటే నిజానికి మొబైల్‌, బ్యాగ్‌ రెండు కలిపి రూ.15,000కు ఇస్తున్నట్లు.. అంతేకానీ బ్యాగ్‌ ఉచితంగా ఇచ్చినట్లు భావించనవసరం లేదు. కాబట్టి ఐటీసీ రివర్స్‌ చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలా ఉచితంగా ఇచ్చే వస్తువుల వివరాలు కూడా బిల్లులో కూడా చూపాలి. అంటే తీసుకునే మొత్తం రెండింటికి కలిపి అని అర్ధం కావాలి. అలాగే జీఎ్‌సటీలో కాంపోజిట్‌ లేదా మిక్స్‌డ్‌ సరఫరా అనే రెండు రకాల సరఫరాలు ఉంటాయి. ఎప్పుడైతే రెండు వస్తువులను ఒకటే ధరకు అమ్ముతారో అప్పుడు ఆయా వస్తువుల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి అది ఏ సరఫరా అనేది నిర్ధారణ అవుతుంది. ఒకవేళ మీరు అమ్మే వస్తువు.. ఉచితంగా ఇచ్చే వస్తువు మిక్స్‌డ్‌ సరఫరా కిందకు వస్తే మాత్రం.. ఎక్కువ జీఎ్‌సటీ ఏ వస్తువు మీద ఉందో అదే జీఎ్‌సటీ మొత్తం బిల్లుకి వర్తిస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు ఈ విషయం మీద అవగాహన కలిగి ఉండాలి.

ఇవీ చదవండి:

విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

లాభాల స్వీకరణతో మార్కెట్లు డౌన్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2025 | 05:52 AM