Modi Putin 2001 photos: మోదీ, పుతిన్.. పాతికేళ్ల బంధం.. పాత ఫొటోలు వైరల్..
ABN , Publish Date - Dec 04 , 2025 | 09:21 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో దేశ ప్రధాని నరేంద్ర మోదీది ప్రత్యేకమైన అనుబంధం. నరేంద్ర మోదీ 2014లో దేశ ప్రధాని అయిన తర్వాతే పుతిన్‌తో పరిచయం ఏర్పడిందని చాలా మంది అనుకుంటారు. అయితే అది నిజం కాదు. అంతకు 13 ఏళ్ల ముందే మోదీ, పుతిన్ మధ్య స్నేహం మొదలైంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో దేశ ప్రధాని నరేంద్ర మోదీది ప్రత్యేకమైన అనుబంధం. నరేంద్ర మోదీ 2014లో దేశ ప్రధాని అయిన తర్వాతే పుతిన్‌తో పరిచయం ఏర్పడిందని చాలా మంది అనుకుంటారు. అయితే అది నిజం కాదు. అంతకు 13 ఏళ్ల ముందే మోదీ, పుతిన్ మధ్య స్నేహం మొదలైంది. అంటే వీరిద్దరి మధ్య స్నేహానికి పాతికేళ్లు పూర్తయ్యాయి (rare Modi Putin meeting).
2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి రష్యా పర్యటనకు వెళ్లారు. వాజ్‌పేయి వెంట అప్పుడు గుజరాత్ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ కూడా రష్యా వెళ్లారు. అప్పుడే తొలిసారి పుతిన్, వాజ్‌పేయి మధ్య స్నేహం మొదలైంది. అప్పటికి మోదీ అంతర్జాతీయ స్థాయిలో ఓ చిన్న నాయకుడు. అయినా ఆయన పట్ల పుతిన్ ఎంతో ఆదరణ, గౌరవం చూపించారట. ఈ విషయాన్ని గతంలో మోదీ పలుసార్లు వెల్లడించారు. 'నేను ఓ చిన్న రాష్ట్రానికి ప్రతినిధిని అని తెలిసినా పుతిన్ నన్ను ఎంతో గౌరవించారు. అదే మా స్నేహానికి బలమైన పునాది' అని మోదీ గతంలో వ్యాఖ్యానించారు ( PM Modi first met Putin).

ఆ పర్యటనలో రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రాంతం, గుజరాత్ మధ్య సహకారం కోసం ఓ చారిత్రక ప్రోటోకాల్ ఒప్పందం కుదిరింది (India Russia relations history). ఆ కీలక ఒప్పందంపై గుజరాత్ సీఎం హోదాలో మోదీ సంతకం చేశారు. ఇక, మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్-రష్యా మధ్య బంధం మరింత బలోపేతం అయింది. వారి మధ్య స్నేహం ఇరు దేశాల మధ్య సమన్వయానికి మరింత దోహదం చేసింది. కాగా, ప్రస్తుతం పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో పాత ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:
కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్
తీరు మార్చుకోని పాక్.. భారత గగనతలంలోకి విమానాలను అనుమతించినా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి