Home » Maoist Encounter
Maoist Encounter 2025: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆంధ్రా గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.
మాన్సూన్ వర్షాలు కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న నక్సలైట్లను అన్వేషించే బలగాలకు పెద్ద అడ్డంకిగా మారాయి. వర్షాల వల్ల అడవులు దట్టమైపోయాయి, గుట్టల మధ్య పథాలు చిత్తడిగా మారాయి. అయినప్పటికీ, బలగాలు 250 బాంబులను నిర్వీర్యం చేసి, నక్సలైట్లతో ఘనమైన ఎన్‌కౌంటర్‌ను నిర్వహించాయి.
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మావోయిస్టులు తుపాకీ వీడాల్సిందేనని, పోలీసులకు లొంగిపోవాల్సిందేనని అన్నారు.
Bandi Sanjay: మావోయిస్టులకు బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీనే నక్షలైట్లను నిషేధించిందని గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని, కర్రెగుట్టల నుంచి సాయిధ బలగాలను ఉపసంహరించుకోవాలని, ఆదివాసీలపై హత్యా కాండను ఆపాలని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఐదుగురు మరో ప్రాంతంలో లొంగిపోయారు. ఎస్ఎల్ఆర్ తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు కూబింగ్ చర్యలు కొనసాగిస్తున్నారు
ఓవైపు భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. మరోవైపు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ఊపందుకుంది.
కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
Human Rights Demad: కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ స్పందించారు. వెంటనే కాల్పులను నిలిపివేయాలని, భద్రతాబలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు.
Letter to CM: ఆపరేషన్ కగార్ పేరిట మవోయిస్టులను కేంద్రం ఏరివేస్తోంది. దీంతో పలువురు మావోయిస్టులు ఇప్పటికే ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. అలాగే పలు ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి. దీంతో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.