Peace Rally: హత్యాకాండను ఆపండి
ABN , Publish Date - May 04 , 2025 | 04:28 AM
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని, కర్రెగుట్టల నుంచి సాయిధ బలగాలను ఉపసంహరించుకోవాలని, ఆదివాసీలపై హత్యా కాండను ఆపాలని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు.

కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక
రాంనగర్, మే 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని, కర్రెగుట్టల నుంచి సాయిధ బలగాలను ఉపసంహరించుకోవాలని, ఆదివాసీలపై హత్యా కాండను ఆపాలని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞన కేంద్రం నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ మీదుగా ఇందిరాపార్కు వరకు శనివారం శాంతిర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, వీక్షణం వేణుగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, అరుణోదయ విమలక్క, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, మాజీ ఎమ్మెల్సీ దేవి ప్రసాద్, ప్రజా సంఘాల నేతలతో పాటు ఉద్యమకారులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని, ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కర్రెగుట్టల నుంచి పారా మిలిటరీ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..