Share News

Warangal: తెలంగాణ సరిహద్దుల్లో రక్తపుటేర్లు.. ముగ్గురు పోలీసులు మృతి..

ABN , Publish Date - May 08 , 2025 | 06:55 PM

Maoists: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నక్సల్స్ తూటాలకు బలైన పోలీసుల అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు.

Warangal: తెలంగాణ సరిహద్దుల్లో రక్తపుటేర్లు.. ముగ్గురు పోలీసులు మృతి..
Police officers Killed In Maoist Attacks

Mulgu Naxal Attack: ములుగు జిల్లా వాజేడు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుదాడికి దిగారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అధికారులు. కాగా, నక్సల్స్ దాడిలో మరణించిన జవాన్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతి చెందిన పోలీసులకు నివాళులు అర్పించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు అధికారులు వరంగల్ చేరుకున్నారు.


ముగురు జవాన్లు.. 8 మంది నక్సల్స్ మృతి..

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం రావడంతో గ్రౌహౌండ్స్ అధికారులు కూంబింగ్ నిర్వహించేందుకు వెళ్లారు. అదే సమయంలో హఠాత్తుగా చంద్రన్న నేతృత్వంలోని మావోయిస్టు దళం కాల్పులకు దిగింది. సుమారు నాలుగు గంటల పాటు భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు గ్రౌహౌండ్స్ జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. మృతులు RSI సుదీర్, సందీప్, పవన్ కల్యాణ్‌గా గుర్తించారు. వీరంతా 25 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో చంద్రన్నతో సహా 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ‌

Updated Date - May 08 , 2025 | 08:39 PM