Home » Mancherial
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతన్నకు తేమ నిబంధనలు శాపంగా మారాయి. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండడంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు.
డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అవగాహన పోస్టర్లను డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ విడుదల చేశారు. ఆయన మాట్లా డుతూ డిసెంబరు 4 వరకు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సహకారంతో వైద్య సిబ్బంది, ఆశాలు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని గురువారం హోంగార్డు జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ పట్టణంలోని రడగంబాల బస్తీలోని ఆయన నివాసంలో శాంతియుత దీక్ష చేపట్టారు. పీవోపీతో తయారు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇం డియా(ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ అన్నారు. జిల్లా అధ్యక్షుడు కారుక ూరి శ్రీనివాస్ అధ్యక్షతన నస్పూర్-శ్రీరాం పూర్ ప్రెస్‌క్లబ్‌లో గురవారం ఆర్‌పీఐ జిల్లా సదస్సు నిర్వహించారు.
జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. దీంతో పాలిటెక్నిక్, ఇంజర్ పూర్తి చేసిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ నిరాహార దీక్షను యాది చేసుకుంటూ ఈ నెల 29న జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్ష దివాస్‌ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. నస్పూర్‌లోని జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలతో జిల్లాస్థాయి సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేసేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతు న్నారు. సీఎంఆర్ పెండింగులో ఉన్న రైస్‌మిల్లులపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో సివిల్ సప్లయిస్ అధికారులు వానాకాలం సీజన్లో ధాన్యం దించేందుకు కేవలం 13 మిల్లులను మాత్రమే ఎంపిక చేసి జియో ట్యాగింగ్ ఇచ్చారు.
ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాస రావు, హరికృష్ణతో కలిసి ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
స్కౌట్స్అండ్ గైడ్స్‌లో చేరడం వల్ల ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉంటారని జీఎం దేవేందర్ తెలిపారు. సోమవారం సింగరేణి పాఠశాల మైదానంలో స్టాండర్డ్ జడ్జింగ్ క్యాంప్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు.