Share News

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:15 PM

ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇం డియా(ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్‌ అన్నారు. జిల్లా అధ్యక్షుడు కారుక ూరి శ్రీనివాస్‌ అధ్యక్షతన నస్పూర్‌-శ్రీరాం పూర్‌ ప్రెస్‌క్లబ్‌లో గురవారం ఆర్‌పీఐ జిల్లా సదస్సు నిర్వహించారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

నస్పూర్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇం డియా(ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్‌ అన్నారు. జిల్లా అధ్యక్షుడు కారుక ూరి శ్రీనివాస్‌ అధ్యక్షతన నస్పూర్‌-శ్రీరాం పూర్‌ ప్రెస్‌క్లబ్‌లో గురవారం ఆర్‌పీఐ జిల్లా సదస్సు నిర్వహించారు. శివరాజ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను అమలు చేయా లన్నారు.

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఇక్కడికి వలస వస్తుండడంతో స్థానిక కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం కార్మికులు, ప్రజలను ఇబ్బం దులకు గురి చేసిందని ఆరోపించారు. వెం టనే ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించి వారి ని ఆదుకో వాలని కోరారు. ఆర్‌పీఐ ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ నేష నల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె. అపర్ణ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్య క్షురాలు మొగు రం మిరియా, జిల్లా అధ్యక్షురాలు లలిత, ప్రధాన కార్యదర్శి మేడి స్వాతి, మండల అధ్యక్షురాలు తల్లండి కవితా బాయి, ఎగ్గిడి సుస్మిత, జాడి సునీత, పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:15 PM