హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:17 PM
హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని గురువారం హోంగార్డు జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ పట్టణంలోని రడగంబాల బస్తీలోని ఆయన నివాసంలో శాంతియుత దీక్ష చేపట్టారు. పీవోపీతో తయారు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు.

బెల్లంపల్లి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని గురువారం హోంగార్డు జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ పట్టణంలోని రడగంబాల బస్తీలోని ఆయన నివాసంలో శాంతియుత దీక్ష చేపట్టారు. పీవోపీతో తయారు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఆయన మాట్లాడుతూ హోంగార్డులను పర్మనెంటు చేయాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. తొలగించిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశా రు. హోంగార్డుల ఉద్యోగ వయోపరిమితి 65 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఈ దీక్ష డిసెంబరు 6 వరకు చేపడతానని పేర్కొన్నారు.