అవగాహన పోస్టర్ల విడుదల
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:19 PM
డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అవగాహన పోస్టర్లను డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ విడుదల చేశారు. ఆయన మాట్లా డుతూ డిసెంబరు 4 వరకు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సహకారంతో వైద్య సిబ్బంది, ఆశాలు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అవగాహన పోస్టర్లను డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ విడుదల చేశారు. ఆయన మాట్లా డుతూ డిసెంబరు 4 వరకు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సహకారంతో వైద్య సిబ్బంది, ఆశాలు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు వివరించాలన్నారు.
అవగాహన అనంతరం కుటుంబ నియం త్రణ శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఇం టింటికి తిరిగి అర్హులైన దంపతులను గుర్తించి కుటుంబ నియంత్రణ గురించి వివరించాలన్నారు. డాక్టర్‌లు సుధాకర్‌నాయక్,అనిత, ప్రసాద్, కృపాబాయి, కాంతారావు, పద్మ, వెంకటేశ్వర్, దామోదర్ పాల్గొన్నారు.