స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో క్రమశిక్షణ
ABN , Publish Date - Nov 25 , 2024 | 10:28 PM
స్కౌట్స్‌అండ్ గైడ్స్‌లో చేరడం వల్ల ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉంటారని జీఎం దేవేందర్ తెలిపారు. సోమవారం సింగరేణి పాఠశాల మైదానంలో స్టాండర్డ్ జడ్జింగ్ క్యాంప్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు.
మందమర్రిటౌన్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): స్కౌట్స్‌అండ్ గైడ్స్‌లో చేరడం వల్ల ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉంటారని జీఎం దేవేందర్ తెలిపారు. సోమవారం సింగరేణి పాఠశాల మైదానంలో స్టాండర్డ్ జడ్జింగ్ క్యాంప్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరడం ద్వారా దేశం పట్ల భక్తి శ్రద్ధలతోపాటు స్కౌటింగ్, స్కిల్స్, టీం వర్కు పెరుగుతాయన్నారు.
సమాజ అభివృద్ధికి పాటు పడతారని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో ప్రతీ అంశాన్ని విద్యార్థులు పరిశీలించాలన్నారు. అంతకుముందు స్కౌట్స్ అండ్ గైడ్స్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. గోదావరిఖని, శ్రీరాంపూర్, మందమర్రి, గోలేటి నుంచి 60 మంది విద్యా ర్థులు పాల్గొన్నారు. సింగరేణి పాఠశాల కరస్పాండెంట్, పర్సనల్ మేనే జర్ శ్యాంసుందర్, హెచ్‌ఎం పురుషోత్తం, మాస్టర్ భాస్కర్, శక్తికు మార్, కృష్ణకుమార్, శ్రీనివాస్, కల్పన, కరిష్మ, విద్యార్థులు పాల్గొన్నారు.