Share News

దీక్ష దివాస్‌ను విజయవంతం చేయండి

ABN , Publish Date - Nov 26 , 2024 | 10:28 PM

తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్‌ నిరాహార దీక్షను యాది చేసుకుంటూ ఈ నెల 29న జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్ష దివాస్‌ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. నస్పూర్‌లోని జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలతో జిల్లాస్థాయి సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు.

దీక్ష దివాస్‌ను విజయవంతం చేయండి

నస్పూర్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్‌ నిరాహార దీక్షను యాది చేసుకుంటూ ఈ నెల 29న జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్ష దివాస్‌ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. నస్పూర్‌లోని జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలతో జిల్లాస్థాయి సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 29న నిర్వహించే దీక్ష దివాస్‌ విధి విధానాలపై కార్యకర్తలకు బాల్క సుమన్‌ దిశానిర్థేశం చేశారు.

కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై దీక్ష దివాస్‌ను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్ళీ రగిలించే విధంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాల చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జీ తుల ఉమా, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌ రావు, దుర్గం చిన్నయ్య, జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 10:28 PM