Home » Mancherial district
నిజామా బాద్-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్-63 విస్త రణ పనులకు బ్రేక్ పడింది. పనులు నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్ హైవే పేరిట పనులకు అనుమతులు మం జూరు చేసింది.
లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. కొడంగల్‌లో రైతన్నలపై అక్రమ కేసులు బనాయించడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహా నికి వినతిపత్రం అందించారు.
క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సీఎం కప్-2024 క్రీడలను అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా యువజనుల క్రీడాశాఖ అధికారి కీర్తి రాజ్‌వీరుతో కలిసి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆయన ప్రారంభించారు.
ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి తోకల సరస్వతి అన్నారు. సీపీఐ కార్యాలయంలో అంగన్‌వాడీలతో నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను వంచించిందని బీజేపీ సంస్థాగత రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీరాయణ అన్నారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రజలను మోసగిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోందని ఎద్దేవా చేశారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రేషన్ కార్డుల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదు. దీంతో కుటుంబాలు వేరు పడిన వారితో పాటు కొత్తగా వివాహం చేసుకున్న వారు రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు జారీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
పోలీసులు గ్రామీణ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. నెన్నెల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం డీసీపీ భాస్కర్‌తో కలిసి పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.
దరఖాస్తుదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణతో కలిసి పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. 1993లో బెల్లంపల్లిలో నిర్మించుకున్న టీడీపీ కార్యాలయాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు మణిరామ్‌సింగ్ ఫిర్యాదు చేశారు.
జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 14,951 మంది అభ్యర్థులకు గాను 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలోని ఫ్రీ మెట్రిక్ హాస్టల్‌లో పని చేస్తున్న డే, నైట్ వాచ్‌మెన్స్, కుక్స్, కామాటీ, అవుట్ సోర్సింగ్ వర్కర్ల పెండింగ్‌లో ఉన్న ఆరు మాసాల వేతనాలు చెల్లించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్‌టీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు.