గ్యారెంటీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్
ABN , Publish Date - Dec 17 , 2024 | 10:38 PM
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను వంచించిందని బీజేపీ సంస్థాగత రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీరాయణ అన్నారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రజలను మోసగిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోందని ఎద్దేవా చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను వంచించిందని బీజేపీ సంస్థాగత రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీరాయణ అన్నారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రజలను మోసగిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోందని ఎద్దేవా చేశారు.
ఏడాదిలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీజేపీని బూత్‌స్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి బద్దం లింగారెడ్డి, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, రజనీష్ జైన్, దుర్గం అశోక్, ముల్కల్ల మల్లారెడ్డి, కొయ్యల ఏమాజీ, ఎనగందుల కృష్ణమూర్తి, అమరాజుల శ్రీదేవి, గాజుల ముఖేష్‌గౌడ్, ముత్తేత సత్తయ్య, మోటపలుకుల గురువయ్య, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.