Share News

ఎన్‌హెచ్‌-63 పనులకు బ్రేక్‌

ABN , Publish Date - Dec 17 , 2024 | 10:44 PM

నిజామా బాద్‌-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్‌-63 విస్త రణ పనులకు బ్రేక్‌ పడింది. పనులు నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పేరిట పనులకు అనుమతులు మం జూరు చేసింది.

ఎన్‌హెచ్‌-63 పనులకు బ్రేక్‌

మంచిర్యాల, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): నిజామా బాద్‌-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్‌-63 విస్త రణ పనులకు బ్రేక్‌ పడింది. పనులు నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పేరిట పనులకు అనుమతులు మం జూరు చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మీదుగా జగిత్యాల-మంచిర్యాల వరకు మొత్తం 148.6 కిలోమీటర్ల పొడవున 63వ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో ఉన్న రోడ్డును విస్తరిం చడంతోపాటు అనుకూలంగా లేనిచోట కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూమి సేకరించాలని నేషనల్‌ హైవే అథారిటీని ఆదేశించింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలకు దూరంగా గుట్టలు, పట్టా భూముల మీదుగా సాగేలా అలైన్‌మెంట్‌ రూపొందించారు. అలైన్‌ మెంట్‌ ప్రకారం నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలోని ఎన్‌హెచ్‌-44 నుంచి ప్రారంభమయ్యే రహదారి పలు గ్రామాల మీదుగా జగిత్యాల జిల్లాలో ప్రవేశిస్తుంది.

హై కోర్టును ఆశ్రయించిన రైతులు...

ఎన్‌హెచ్‌-63 కోసం అధికారులు మూడు దఫాలుగా రూట్‌ మ్యాప్‌లో మార్పులు చేశారు. మొదటి అలైన్‌ మెంట్‌ ప్రకారం కొందరు బడాబాబులకు నష్టం వాటిల్లు తుండడంతో వారి ఒత్తిడికి తలొగ్గి రెండో రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. లక్షెట్టిపేట నుంచి ముల్కల్ల వరకు పూర్తిగా నివాస గృహాల మీదుగా వెళ్తుంది. దీనివల్ల సామాన్య ప్రజానీకానికి నష్టం కలిగేలా ఉంది. అష్టక ష్టాలు పడి నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేతకు గురవుతుం డటంతో ఆయా గ్రామాల ప్రజలు సర్వే పనులను అడ్డుకోవడం, భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆందోళనలు నిర్వహించారు. దీనికి స్పందించిన ఎన్‌హెచ్‌ అధికారులు మూడో రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. కొత్త అలైన్‌మెంట్‌తో జీవనాధారామైన సాగు భూములను సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అలైన్‌మెంట్‌ ప్రకారం లక్షెట్టిపేట మండలం మీదుగా గోదావరి నదికి సమాంతరంగా పంట పొలాలు, చేల మీదుగా రహదారి నిర్మాణం జరగాల్సి ఉంది. గతంలో ఈ ప్రాంత రైతులకు చెందిన భూములు పెద్ద ఎత్తున శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గరయ్యాయి. మిగిలిన కొద్దిపాటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మళ్లీ రహదారి నిర్మాణానికి భూములు సేకరిస్తుండటంతో వారంతా ఆందోళనబాట పట్టారు. తమకు నష్టం కలిగించే రూట్‌మ్యాప్‌ను రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల వివరించినా ఫలితం లేకపోవడంతో హై కోర్టును ఆశ్రయించారు.

పనులు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ....

రైతుల పక్షాన వెల్గటూర్‌కు చెందిన న్యాయవాది దోరిశెట్టి పోచయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం ఎన్‌హెచ్‌-63 పనులు ఆపాలని డబ్ల్యూపీ నెం.35476/2024 ద్వారా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌హెచ్‌ అథారిటీ యాక్ట్‌ సెక్షన్‌ 3సీ ప్రకా రం అధికారులు విధానాలను అమలు చేయలేదని, రైతుల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోక పోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఈ మేరకు జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ఎన్‌హెచ్‌-63 పనులు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

న్యాయం గెలిచింది....నాగిరెడ్డి రమాదేవి, సూరారం

అధికారుల చర్యలు ఏడాది కాలంగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. భూములు ఇవ్వమని చెప్పినా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లోనే రైతులం కోర్టును ఆశ్రయించాం. కోర్టు తీర్పు ద్వారా న్యాయమే గెలిచింది.

రైతులకు అన్యాయం జరగొద్దు....హైకోర్టు న్యాయవాది దోరిశెట్టి పోచయ్య

భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతుల గోడును పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఉన్న భూములన్నీ రహదారి పేరిట లాగేసుకుంటే వాళ్లు ఎలా బతకాలి. నేషనల్‌ హైవే అథారిటీ యాక్ట్‌ ప్రకారం కూడా చెల్లింపులు చేయడం లేదు. అందుకే రైతుల పక్షాన న్యాయ స్థానంలో వాదనలు వినిపించాను.

Updated Date - Dec 17 , 2024 | 10:44 PM