Share News

రహదారుల పక్కన విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Dec 18 , 2024 | 10:16 PM

పట్టణంలోని చిరు వ్యాపా రులు, కూరగాయల వ్యాపారులు ఎవరైనా రహదారుల పక్కన విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత అన్నారు. బుధవారం చిరు వ్యాపారుల కోసం బంకర్‌ వద్ద స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు.

రహదారుల పక్కన విక్రయిస్తే చర్యలు

బెల్లంపల్లి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని చిరు వ్యాపా రులు, కూరగాయల వ్యాపారులు ఎవరైనా రహదారుల పక్కన విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత అన్నారు. బుధవారం చిరు వ్యాపారుల కోసం బంకర్‌ వద్ద స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. చిరు వ్యాపారులు రహదారుల పక్కన విక్రయించడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు.

నూత నంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ ఎదుట ఉన్న బంకర్‌ వద్ద చిరు వ్యాపారులకు స్థలం కేటాయించామని, మరో రెండు రోజుల్లో ఏర్పాట్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. రహదారుల పక్కన విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 10:16 PM