అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Dec 17 , 2024 | 10:39 PM
ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి తోకల సరస్వతి అన్నారు. సీపీఐ కార్యాలయంలో అంగన్‌వాడీలతో నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి తోకల సరస్వతి అన్నారు. సీపీఐ కార్యాలయంలో అంగన్‌వాడీలతో నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేతనాలు సక్రమంగా రావడం లేదని, రిటైర్ అయిన టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు లక్ష రూపాయలు చెల్లించాలని, పెన్షన్ త్వరగా చెల్లించే ఏర్పాటు చేయాలని, ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు వేతనాలు పెంచాలని, టీఏ, డీఏలు ఇంటి అద్దెలు చెల్లించాలని, ఆయాలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
కిష్టంపేట్ సెక్టార్, లక్షెట్టిపేట ప్రాజెక్ట్‌కు చెందిన పలువురు ఏఐటీయూసీలో చేరగా, వారికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌లు కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో భూపతిరావు రమాదేవి, కుసుమ కుమారి, నేరెళ్ల అరుణ, తిరుమల, కాంతకృష్ణ, శంకరమ్మ, రాజమణి, రేణు, నస్రీన్ పాల్గొన్నారు.