Share News

భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Dec 18 , 2024 | 10:22 PM

పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీఈవో యాదయ్య సూచించారు. బుధవారం నెన్నెల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

నెన్నెల, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీఈవో యాదయ్య సూచించారు. బుధవారం నెన్నెల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సన్నబియ్యం, కూరగాయల నాణ్యత, భోజనాన్ని వండుతున్న విధానాన్ని పరిశీలించారు.

వంటగది, పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వంట చేసేవారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. నూతన మెనూ అమలు, భోజనం రుచిపై వాకబు చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బంది, విద్యార్థుల హాజరు శాతంపై ఎస్‌వో, హెచ్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో శతశాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వెనుకబడ్డ విధ్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 10:22 PM