Home » Lpg Price
గుడ్ న్యూస్.. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. అమెరికా నుండి భారీ ఎల్‌పీజీ కార్గో నౌక కర్ణాటకలోని మంగళూరు తీరానికి చేరుకుంది. ఇంధన భద్రత, సరఫరాలో ఇదొక కీలక పరిణామంగా నిలుస్తుంది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు.
ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఎల్పీజీ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారత్ కీలక విజయాన్ని సాధించింది. భారీ ఎల్‌పిజి నౌక శివాలిక్ నిన్న గుజరాత్‌కు రాగా, నేడు ఎల్‌పిజి నౌక నందా దేవి, క్రూడ్ ఆయిల్ నౌక జగ్ లాడ్కీ గుజరాత్ పోర్టుకు వస్తున్నాయి.
ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో బయలుదేరిన భారీ ట్యాంకర్ 'శివాలిక్', సురక్షితంగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. గుజరాత్‌లోని అదానీ ముంద్రా పోర్టులో ఈ గ్యాస్ అన్-లోడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరవ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అంతర్జాతీయ చమురు రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలను ఈ మార్గం ద్వారా ప్రయాణించడానికి అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది.
ఏపీలో గ్యాస్ కష్టాలు లేవని ఏపీ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కొరత ఉందన్న తప్పుడు ప్రచారం వల్ల వినియోగదారులు ఆందోళనకు గురై, సాధారణం కంటే 15 శాతం అదనంగా రీఫిల్ బుకింగ్స్ చేసుకుంటున్నారని గుర్తించింది.
ఇండక్షన్ స్టవ్‌ను కొనుగోలు చేసేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.