Share News

ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం: కేంద్రం

ABN , Publish Date - Mar 19 , 2026 | 08:27 PM

ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఎల్పీజీ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్లాక్‌ మార్కెటింగ్‌‌ను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది.

ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం: కేంద్రం
LPG shortage India government steps

ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఎల్పీజీ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్లాక్‌ మార్కెటింగ్‌‌ను అరికట్టడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు పేర్కొంది. బుధవారం దేశవ్యాప్తంగా 6 వేల ప్రాంతాల్లో దాడులు జరిగాయని వెల్లడించింది. అలాగే ప్రజలు ఎల్పీజీకి బదులుగా పీఎన్జీ కనెక్షన్లను తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది (LPG shortage India government steps).


పీఎన్జీ సదుపాయాలను విస్తరించే రాష్ట్రాలకు అదనంగా 10 శాతం కమర్షియల్‌ ఎల్పీజీ కేటాయిస్తామని కేంద్రం పేర్కొంది. దేశంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌లు 94 శాతం పెరిగాయని, ప్రస్తుతానికి ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలోనే ఉందని తెలిపింది. అలాగే దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వాటి వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమచారాన్ని షేర్ చేయాలని ఆదేశించింది (Centre on LPG supply India).


ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో పెట్రోల్, సహజ వాయువు సరఫరా (LPG crisis India update) గొలుసును పర్యవేక్షించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. చమురు, గ్యాస్ కంపెనీలు ఈ సమచారాన్ని పెట్రోల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్‌కు ఇవ్వాలని సూచించింది.


ఇవి కూడా చదవండి..

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..


మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..

Updated Date - Mar 19 , 2026 | 09:37 PM