Home » Latest News
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే .. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారా అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలో దసరా పండుగకు చీరలు ఇస్తే సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఓట్లకు చీరలు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. మహిళలకు ఇచ్చిన చీరలు యూనిఫామ్ చీరల్లాగా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ పలు రంగుల చీరలు ఇచ్చారని... కోటి 30 లక్షల చీరలను ప్రతి బతుకమ్మకు కేసీఆర్ హయాంలో ఇచ్చామని గుర్తుచేశారు.
సర్పంచ్ పదవికి లవర్తో కలిసి నామినేషన్ వేశాడు ఓ యువకుడు. అనంతరం, ఆ యువతిని వివాహం చేసుకున్నాడు.
తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతిచెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
దిత్వా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో భక్తులకు, జిల్లా ప్రజలకు భద్రతా సూచనలు సూచించారు .
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో రేపటి నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మీరు డైటింగ్ చేస్తున్నారా? అయితే, క్రమం తప్పకుండా ఈ పండు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండు అనేక ప్రయోజనాలను ఇస్తుందని చెబుతున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్రను డిసెంబర్ 4వ తేదీ నుంచి కొనసాగించనున్నారు. అక్టోబర్ 25వ తేదీన నిజామాబాద్లో కవిత జనంబాట యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.