Share News

పిల్లలు మొబైల్, టీవీకి బానిస కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:37 PM

తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసులోనే ఫోన్లు ఇస్తున్నారు. ఇది వారి శారీరక, మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తోంది. పిల్లలు మొబైల్, టీవీకి బానిస కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లలు మొబైల్, టీవీకి బానిస కాకుండా ఉండాలంటే ఇలా చేయండి
Children Mobile Addiction Tips

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది పిల్లలు మొబైల్, టీవీలకు బానిసలవుతున్నారు. వాటికి అలవాటు పడి, తల్లిదండ్రులతో మాట్లాడటం, బయట ఆడుకోవడం తగ్గిస్తున్నారు. వైద్య నిపుణుల ప్రకారం.. చిన్న వయసులోనే స్క్రీన్‌లకు ఎక్కువగా అలవాటు పడటం వల్ల పిల్లల్లో మానసిక అభివృద్ధి, సామాజిక నైపుణ్యాలు, శారీరక ఆరోగ్యం దెబ్బతింటాయి. బయట ఆడుకోవడం, స్నేహితులతో కలవడం వంటి సహజ అలవాట్లు తగ్గిపోతాయి. అందువల్ల తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.


ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పనుల కారణంగా పిల్లలతో సమయం గడపలేక, వారిని ప్రశాంతంగా ఉంచడానికి మొబైల్, టీవీలను అలవాటు చేస్తున్నారు. ఇది పిల్లల మానసిక సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే వారి సామాజిక, శారీరక అభివృద్ధి కూడా తగ్గుతుంది.


ఏం చేయాలి?

  • 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మొబైల్ ఫోన్లు పూర్తిగా దూరంగా ఉంచాలి.

  • ఈ వయస్సులో వీడియో కాల్స్ కూడా ఎక్కువగా చేయించకపోవడం మంచిది.

  • 2 సంవత్సరాల పైబడిన పిల్లలకు కూడా స్క్రీన్ టైమ్ చాలా పరిమితంగా ఉండాలి.

  • రోజుకు 15–20 నిమిషాల కంటే ఎక్కువ మొబైల్ లేదా టీవీ చూడనివ్వకండి.

  • మొబైల్ వాడే సమయానికి నియమాలు పెట్టండి.


తల్లిదండ్రులకు చిట్కాలు

  • ప్రతిరోజూ పిల్లలతో కొంత సమయం గడపండి.

  • బయట ఆటలు ఆడటానికి ప్రోత్సహించండి.

  • ఇంట్లో నో ఫోన్ టైం నిర్ణయించండి.

  • తల్లిదండ్రులు కూడా తమ స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలి.

  • పిల్లలతో మాట్లాడటం, కథలు చెప్పడం, ఆటలు ఆడటం అలవాటు చేయాలి.

పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం మొబైల్ వాడకాన్ని నియంత్రించడం చాలా అవసరం. చిన్న వయస్సులో మంచి అలవాట్లు పెంచితే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!

అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!

For More Latest News

Updated Date - Feb 18 , 2026 | 05:12 PM