Home » KonaSeema
మహాకుంభ మేళా యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమలాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని రైతులకు నేరుగా వర్తింపచేసేందుకు కొత్తగా భూ ఆధార్-ఫార్మర్ రిజిస్ర్టీ కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు ఆదివారం తెలిపారు.
హోల్‌సేల్‌గా కూరగాయల ధరలు దిగజారడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కోసారి కోత, రవాణా చార్జీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. కూరగాయల పంటలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని లంక భూములు ప్రసిద్ధి. శ్రేష్ఠమైన లంక మట్టిలో ఏ రకమైన కూరగాయలు సాగు చేసినప్పటికీ మంచి దిగుబడులు వస్తాయి.
అన్నదాతలకు వ్యవసాయ సేవలను సులభతరం చేసి మరింత పారదర్శకంగా అందించేందుకు ప్రతి రైతుకూప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య అందుబాటులోకి తీసుకురానున్నారు.
రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్యను ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేయడంతో పాటు 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు.
జిల్లాలో కొత్త రైతుబజార్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి దశలో మున్సిపాల్టీల పరిధిలో ప్రజల అవసరాలు తీర్చేలా వీటిని నిర్మించాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో అయిదేళ్ల తర్వాత తిరిగి వీటి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.
అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసిన బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించడం చట్ట విరుద్ధమని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. జిల్లాలోని పలు వ్యాపార సంస్థలకు చేరుకున్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసి ఎంఎల్‌ఎస్ పాయింట్లలో భద్రపరిచినట్లు చెప్పారు. మండపేట మండలం వేములపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద 82.944 మెట్రిక్ టన్నులు, అంబాజీపేట మండలం ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద 20.506 మెట్రిక్ టన్నుల సీజ్‌చేసిన బియ్యం ఉందన్నారు.
శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా కాల్వలు, డ్రైన్లపై అవసరమైన చోట్ల క్రాస్‌బండ్లు ఏర్పాటుచేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధంచేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
పేదరికంలో అట్టడుగున ఉన్న 20శాతం మందిని గుర్తించేందుకు మార్చి 10 నుంచి చట్టబద్ధమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌లో మొదటి సూత్రమైన జీవో ప్రోవర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్‌షిప్ పి-4 విధానాన్ని రూపొందించిందన్నారు.