Share News

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:13 AM

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించబోమన్నారు.

 నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించబోమన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయిలోను, మండల కార్యాలయాల్లో మండలస్థాయిలోను నిర్వహించే మీ కోసం కార్యక్రమాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు నిర్వహించడం లేదని వివరించారు. కేవలం గ్రామ సచివాలయాల్లో మాత్రమే అర్జీదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చునన్నారు.

డయల్‌ యువర్‌ కమిషనర్‌ రద్దు..

సోమవారం అమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌ కేవీఆర్‌ఆర్‌ రాజు ఆధ్వర్యంలో పట్టణంలోని సమస్యలపై నిర్వహించాల్సి ఉన్న డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌ కారణంగా నిలుపుదల చేసినట్టు కమిషనర్‌ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు ఈ కార్యక్రమం నిర్వహించబోమన్నారు. మార్చి 8వ తేదీ తర్వాత నిర్వహిస్తామని ప్రకటించారు.

Updated Date - Feb 03 , 2025 | 12:13 AM