• Home » KonaSeema

KonaSeema

ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య

ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య

అన్నదాతలకు వ్యవసాయ సేవలను సులభతరం చేసి మరింత పారదర్శకంగా అందించేందుకు ప్రతి రైతుకూప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య అందుబాటులోకి తీసుకురానున్నారు.

దామోదరం సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి

దామోదరం సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి

రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్యను ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చెప్పారు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా పనిచేయడంతో పాటు 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు.

బజార్ల బెంగ తీరినట్టే

బజార్ల బెంగ తీరినట్టే

జిల్లాలో కొత్త రైతుబజార్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి దశలో మున్సిపాల్టీల పరిధిలో ప్రజల అవసరాలు తీర్చేలా వీటిని నిర్మించాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో అయిదేళ్ల తర్వాత తిరిగి వీటి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.

టెన్త్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

టెన్త్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 బియ్యం వేలానికి చర్యలు

బియ్యం వేలానికి చర్యలు

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసిన బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం చట్ట విరుద్ధమని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చెప్పారు. జిల్లాలోని పలు వ్యాపార సంస్థలకు చేరుకున్న పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్‌ చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో భద్రపరిచినట్లు చెప్పారు. మండపేట మండలం వేములపల్లి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద 82.944 మెట్రిక్‌ టన్నులు, అంబాజీపేట మండలం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద 20.506 మెట్రిక్‌ టన్నుల సీజ్‌చేసిన బియ్యం ఉందన్నారు.

శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా  క్రాస్‌ బండ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు

శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా క్రాస్‌ బండ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు

శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా కాల్వలు, డ్రైన్లపై అవసరమైన చోట్ల క్రాస్‌బండ్లు ఏర్పాటుచేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధంచేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

మార్చి 10 నుంచి పేదల గుర్తింపునకు చట్టబద్ధమైన సర్వే

మార్చి 10 నుంచి పేదల గుర్తింపునకు చట్టబద్ధమైన సర్వే

పేదరికంలో అట్టడుగున ఉన్న 20శాతం మందిని గుర్తించేందుకు మార్చి 10 నుంచి చట్టబద్ధమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్‌లో మొదటి సూత్రమైన జీవో ప్రోవర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌, ప్రైవేట్‌ పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌ పి-4 విధానాన్ని రూపొందించిందన్నారు.

దేవాలయాలకు పూర్తి సహకారాలు

దేవాలయాలకు పూర్తి సహకారాలు

మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26న జిల్లాలోనే వివిధ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోని దేవాలయాలకు జిల్లా యంత్రాంగం నుంచి సహాయ సహకారాలు అందించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చెప్పారు.

 కోకో గిట్టుబాటు ధరకు ప్రభుత్వ ప్రణాళికలు

కోకో గిట్టుబాటు ధరకు ప్రభుత్వ ప్రణాళికలు

కోకో పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి మర్కెట్‌లో పలికే గిట్టుబాటు ధర క్షేత్రస్థాయిలో రైతుకు చేరే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. కోనసీమ జిల్లాలో కొబ్బరిలో కోకోను అంతర పంటగా అభివృద్ధి చేసి జిల్లాను కోకో హబ్‌గా తీర్చిదిద్దాలని రైతులకు ఆయన సూచించారు.

ప్రతి భక్తునికి కల్యాణం చూసే భాగ్యం కల్పించాలి

ప్రతి భక్తునికి కల్యాణం చూసే భాగ్యం కల్పించాలి

దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని అమలాపురం ఆర్డీవో కె.మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మంగళవారం చంద్రప్రభ, సూర్యవాహనాల గ్రామోత్సవాలు జరిగాయని, భక్తుల కోర్కెలు తీర్చే శ్రీకరుడు, సర్వశుభాలను ఇచ్చే శుభకరుడు లక్ష్మీనరసింహస్వామి ఆధ్యాత్మిక వైభవానికి ప్రత్యేకంగా ఉన్న అంతర్వేది మహాపుణ్యక్షేత్రంలో ఉత్సవాలు ప్రారంభించామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి