Share News

గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Feb 20 , 2025 | 12:32 AM

మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో 5వ తరగతి ప్రవేశాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినట్టు జిల్లా కన్వీనర్‌, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైటీఎస్‌ రాజు తెలిపారు.

గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

అమలాపురం రూరల్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో 5వ తరగతి ప్రవేశాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినట్టు జిల్లా కన్వీనర్‌, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైటీఎస్‌ రాజు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపించాలన్నారు. ఈ నెల 15 నుంచి మార్చి 15వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. కోనసీమ జిల్లాలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాల (బాలురు-ఫిషర్‌మెన్‌) అమలాపురంలో 80 సీట్లు, రామచంద్రపురం బాలికల పాఠశాలలో 40 సీట్లు చొప్పున ఖాళీగా ఉన్నాయన్నారు. అదే విధంగా 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్లకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. మరిన్ని వివరాల కోసం ఆయా గురుకుల పాఠశాలల పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలలోపు సంబంధిత ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించవచ్చునని రాజు తెలిపారు.

Updated Date - Feb 20 , 2025 | 12:32 AM