Share News

రైతులూ..రైతు బజార్లలో నేరుగా అమ్ముకోండి..

ABN , Publish Date - Feb 18 , 2025 | 01:18 AM

కూరగాయ ధరలు తగ్గడంతో నష్టపోకుండా రైతుబజార్లలో నేరుగా రైతులు అమ్ము కునేలా చర్యలు చేపట్టినట్టు జిల్లా మార్కెటింగ్‌ ఏడీ కె.రాఘవేంద్రరావు తెలిపారు.

రైతులూ..రైతు బజార్లలో నేరుగా అమ్ముకోండి..

కార్పొరేషన్‌(కాకినాడ), ఫిబ్రవరి 17(ఆంధ్ర జ్యోతి): కూరగాయ ధరలు తగ్గడంతో నష్టపోకుండా రైతుబజార్లలో నేరుగా రైతులు అమ్ము కునేలా చర్యలు చేపట్టినట్టు జిల్లా మార్కెటింగ్‌ ఏడీ కె.రాఘవేంద్రరావు తెలిపారు. టమాటా, కాయగూరల ధరలు తగ్గడంతో రైతులు నష్టపోకుండా వారి పంటలను నేరుగా విక్రయించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. రైతులు ఆయా రైతుబజార్లలో ఎస్టేట్‌ అధికారులను సంప్రదిస్తే సదుపాయాలు కల్పిస్తారని ఆయన చెప్పారు.

Updated Date - Feb 18 , 2025 | 01:18 AM