Home » Kishan Reddy G
దేశంలో మెడికల్ టూరిజం పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్లు, మందులు తయారీలో భారత్ టాప్‌లో ఉందని ధీమా వ్యక్తం చేశారు. వాటితో పాటు డయాబెటిస్ సమస్య కూడా దేశంలో పెరిగిందని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు సహకారం ఎందుకు అందించడం లేదని గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు.
అన్నదాతలు అందరూ ఒకేసారి పత్తిని జిన్నింగ్ మిల్స్‌కి తీసుకురావడంతో పంట కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగానే పత్తిని ఏ రోజు తీసుకువస్తారనేది రిజిస్టర్ చేసుకుంటే సమస్య ఉండదని కిషన్‌రెడ్డి తెలిపారు.
కాలం చెల్లిన చట్టాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేశారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.
షాడో సీఎం ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు, చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
దేశంలోని అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ముందుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కలిసి అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా సేవలందించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించాలని సూచించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ జీవితం స్ఫూర్తిదాయకని కిషన్‌రెడ్డి కొనియాడారు.
తెలంగాణ జెన్‌కో, సింగరేణి యాజమాన్యాలకు జాతీయ అవార్డు లు వరించాయి. పర్యావరణహిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ సంస్థగా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో హైదరాబాద్ అవశ్యకత గురించి చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మాటలను గుర్తు చేశారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా హైదరాబాద్ ప్రజలు చేసిన నిస్వార్థ త్యాగాలను గుర్తుచేశారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాల కట్టడికి ప్రజా ఉద్యమం అవసరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రతి ఇంచి నుంచి ఒకరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనకపోతే ఈ సమస్య నుంచి బయటపడలేమని చెప్పారు.