Home » Kerala
ఓ ఆఫీసులో ఉద్యోగి కుక్కలా పాకుతున్నాడు. అతడి పక్కనే ఓ వ్యక్తి నిలబడి శిక్ష విధిస్తున్నట్లుగా ఉంది. ఇలా అతను చాలా దూరం వరకూ కుక్కలా పాకుతుండగా.. మరో వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శబరిమల గుడికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ పనితో వివాదం రాజుకుంది.
Kerala Tourism: కేరళ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి రాష్ట్రంలోని సుందర దృశ్యాలను నిక్షిప్తం చేస్తూ.. కేరళ పర్యాటక శాఖ ఓ వీడియో థీమ్ సాంగ్‌ను రూపొందించింది. ఈ వీడియోను కేరళ పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్ విడుదల చేశారు. యువ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సమక్షంలో విడుదల చేసిన ఈ వీడియో ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఈ ఏడాది ద్వితీయార్థంలో కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజీవ్ చంద్రశేఖర్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అధిక బరువు అపోహలో పడి ఓ టీనేజర్ తీవ్రంగా డైటింగ్ చేసి దుర్మరణం చెందిన షాకింగ్ ఘటన కేరళలో వెలుగు చూసింది. 18 ఏళ్ల వయసులో, 24 కేజీల బరువుతో మంచాన పడ్డ ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం చెందింది.
Udta Kerala:చరిత్రలో ఎన్నో పెద్ద సంక్షోభాలకు విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగిన కేరళ రాష్ట్రం ముంగిట మరో కొత్త సవాల్ నిలిచింది. ఇప్పుడు ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయింది కేరళ. ఇది కేరళ ప్రజల భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారింది. ఇది దక్షిణాదిలోని పక్క రాష్ట్రాల వారికి..
Vidarbha: రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది. ఆ టీమ్ 7 ఏళ్ల గ్యాప్‌లో 3 సార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. మరి.. ఆ జట్టు ఏదనేది ఇప్పుడు చూద్దాం..
కేరళలో కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
Kerala Horror Crime : తిరువనంతపురంలో ఓకే రాత్రిలో 5 హత్యల కేసు సంచలనం రేపుతోంది. నరరూపరాక్షసుడిలా మూడు కుటుంబాలను వెంటాడి వేటాడి నరికి చంపాడు ఓ వ్యక్తి. తర్వాతి రోజున ఏ మాత్రం జంకు గొంకు లేకుండా తాపీగా పోలీసులకు లొంగిపోయాడు. ఎందుకిలా చేశాడు. అసలా రాత్రి ఏం జరిగింది. ఈ హత్యల వెనక ఉన్న కారణమేంటి?