రూపాయకే బ్రాండెడ్ షూ.. షాపు దగ్గరకు ఎగబడ్డ జనం..
ABN , Publish Date - Mar 09 , 2026 | 09:53 AM
కేరళంలో రూపాయకే బ్రాండెడ్ షూ అంటూ ఓ షూ షాపు చేసిన ప్రమోషన్ స్టంట్ రచ్చకు దారి తీసింది. బ్రాండెడ్ షూ దక్కించుకోవటానికి జనం పెద్ద ఎత్తున షాపు దగ్గరకు వచ్చారు. వేల సంఖ్యలో జనం రావటంతో షాపు దగ్గర బీభత్సం జరిగింది.
ఇంటర్‌నెట్ డెస్క్: రూపాయకే బ్రాండెడ్ షూ అంటూ ఓ షూ షాపు చేసిన ప్రమోషన్ స్టంట్ రచ్చకు దారి తీసింది. బ్రాండెడ్ షూ దక్కించుకోవటానికి జనం పెద్ద ఎత్తున షాపు దగ్గరకు వచ్చారు. వేల సంఖ్యలో జనం రావటంతో షాపు దగ్గర బీభత్సం జరిగింది. అక్కడి రోడ్డన్నీ బ్లాక్ అయిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆఫర్ పేరుతో జనాలను ఇబ్బందిపెట్టిన షాపు యజమానులు అడ్డంగా బుక్కయ్యారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కేరళంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కోజికోడ్‌లోని ఓ షూ షాపు రూపాయకే బ్రాండెడ్ షూ ఇస్తామని ప్రకటించింది.
ఇందుకోసం కొన్ని కండీషన్లు పెట్టింది. రూపాయి నోటు తెచ్చిన వారికే షూ ఇస్తామని, అది కూడా మొదటి 100 మందికి మాత్రమే షూ ఇస్తామని చెప్పింది. ఆదివారం వంద మందికి షూలు పంచుతామని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ ఆఫర్‌ను బాగా ప్రమోట్ చేసింది. ఆ ఆఫర్ గురించి తెలుసుకున్న జనం శనివారం మధ్యాహ్నం నుంచే షాపు దగ్గరకు క్యూ కట్టారు. సాయంత్రానికి జనం పెద్ద సంఖ్యలో షాపు దగ్గరకు వచ్చారు. ఆదివారం ఉదయానికి వేల మంది షాపు దగ్గరకు వచ్చారు. రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. షూ కోసం వచ్చిన జనాలను అదుపు చేయడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసులు షాపు యజమానులను అరెస్ట్ చేశారు. షాపు దగ్గరకు వచ్చిన కస్టమర్లకు భద్రత కల్పించటంలో విఫలం అయ్యారని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆఫర్‌కు బ్రేక్ పడింది. ఒక్కరు కూడా షూ తీసుకోకుండానే తిరిగివెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష
తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు