Home » Kaleshwaram Project
Minister Sridhar Babu: కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.
సరస్వతీ పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం త్రివేణి సంగమానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎన్‌ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కేంద్ర సంస్థలతో భూ సాంకేతిక(జియో టెక్నికల్), భూ భౌతిక(జియో ఫిజికల్) పరీక్షలను వెంటనే చేయించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకే మళ్లించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. అయినా.. ఆ ప్రాజెక్టు నిర్మాణంలోనే దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అక్రమాలు చేసిందన్నారు.
దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం అభివృద్ధికి ఎంత ఖర్చయినా నిధులు మంజూరు చేస్తామని, వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇంజనీర్లు తమ పని తాము చేయాలని, ప్రాజెక్టులు కట్టాలనే విధాన నిర్ణయం మాత్రమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంజనీర్లు చేయాల్సిన పనిని.. ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు చేయకూడదన్నారు.
ఈసారి గోదావరి వరదలు మేడిగడ్డను మళ్లీ ముంచే అవకాశముందా అనే సందేహం వేగంగా వినిపిస్తోంది. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ మరమ్మతులకు ముందడుగు వేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ పనుల్లో రాజీ పడొద్దని.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూవేగంగా పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు.
Hariram ACB Case: హరిరామ్‌ను ఐదురోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈరోజు నాలుగోరోజు విచారణ కొనసాగుతోంది. అయితే గడిచిన మూడు రోజుల విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హరిరామ్‌ను దాదాపు ఐదు మంది అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ ఎన్‌డీఎస్ఏ నివేదిక ఇవ్వడంతో.. దాని ఆధారంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.