Home » Kaleshwaram Project
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన నగరంలోనే ఉండనున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల నిర్మాణానికి తొలుత మంత్రివర్గం ఆమోదం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా పెరుగుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి నాటి మంత్రివర్గం ఆమోదం లేదని ప్రస్తుత మంత్రివర్గం నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులతోనే వీటి నిర్మాణానికి నిర్ణయం..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని ఏటీఎం లాగా బీఆర్ఎస్ నేతలు వాడుకున్నది వాస్తవం కాదా అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలే తమ స్టాండ్ అని రాజాసింగ్ ప్రకటించారు.
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ ఖర్చంతా నిర్మాణ సంస్థలే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
క్యాబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యమవుతుందా అని బీజేపీ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నిబంధనలు పాటించని అధికారులపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక చేతికి అందాకే తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విచారణతో ముడిపడిన పత్రాలన్నీ తమకు చేరాయని.. మిగతా ఫైళ్లు అక్కర్లేదని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి తెలిపింది.