Share News

లాకర్లలో ఆస్తులు రూ.5 కోట్లపైనే!

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:58 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ అక్రమాస్తుల చిట్టా పెరుగుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

లాకర్లలో ఆస్తులు రూ.5 కోట్లపైనే!

  • నీటిపారుదల ఈఈ నూనె శ్రీధర్‌ బ్యాంకు

  • లాకర్లలో ఆస్తుల పత్రాలు, ఆభరణాలు

  • నేటితో ముగియనున్న ఏసీబీ కస్టడీ

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ అక్రమాస్తుల చిట్టా పెరుగుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే రూ.వందల కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో మరికొన్ని ఆస్తుల్ని కనుగొన్నారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న శ్రీధర్‌ను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. సోమవారం అతని బ్యాంకు లాకర్లను తెరిచారు. వాటిలో దొరికిన స్థిరాస్తుల పత్రాలు, బంగారం విలువ రూ.5 కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి సంబంధించి అరెస్టయిన మిగతా వారు కూడా అక్రమంగా సంపాదించిన సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్‌ కస్టడీ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు అనుమతితో అతన్ని మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


4 రోజులపాటు తెలంగాణలో వానలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో ఉత్తరాంధ్ర తీరం, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Jun 24 , 2025 | 03:58 AM