Home » Kakinada
కాకినాడ జిల్లా, గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలో తిండి ప్రస్కిల్లా (27) అనే యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసిన కాకినాడకు చెందిన ఆల్మైటి జెనిసెస్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరోసారి గాలింపు చర్యలు ముమ్మురం చేశారు.
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 2న కాకినాడ జిల్లా సర్పవరంలో రావణ్‌ను అరెస్ట్ చేసిన సమయంలో అతని మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ కారు కదలికలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, విచారణలో పోలీసులకు రావణ్ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది.
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు వాల్ పోస్టర్ విడుదల చేశారు.
కాకినాడలో జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సంస్థ వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక లాభాల పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది నుంచి భారీ మొత్తంలో ఈ సంస్థ పెట్టుబడులు సేకరించింది. గత కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరుతో నకిలీ టీటీడీ లేఖ కలకలం రేపుతోంది. టీటీడీ దర్శనం కోసం ఎమ్మెల్సీ లెటర్ హెడ్‌తో నకిలీ సిఫార్స్ లేఖ తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది.