Home » Jubilee Hills By-Election
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వయోధికులు, దివ్యాంగులకు హోం ఓటింగ్ నేడు ప్రారంభం కానుంది. అధికారుల బృందం ఇళ్ల వద్దకు వెళ్లి వారు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనుంది. 85 ఏళ్లు దాటిన, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ సదుపాయం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎం ఓట్ల కోసమే బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశం అయ్యారు.
మాజీ మంత్రి కేటీఆర్.. తన సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం మేలు చేస్తారు..? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు, ఫొటో ఉన్న ఓటరు గుర్తింపుకార్డు ప్రతులను నాయకులు పంపిణీ చేశారు.
జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అందరికీ అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియను నిర్వహించే యూసు్‌ఫగూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాన్ని డిస్ర్టిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ (డీఆర్సీ)సెంటర్‌గా మార్చి మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్ట్రాంగ్‌రూమ్ భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొంతమంది అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఓటు బ్యాంక్‌లు కొల్లగొట్టేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆలయాలు, ప్రార్థన మందిరాలను కూడా వదలడం లేదు.
రాష్ట్రంలో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. నామినేషన్ల పర్వం ముగిసి వారం రోజులు గడిచినా.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నా.. ఓటర్ల మనసులో ఏముందన్న విషయంపై స్పష్టత రాని పరిస్థితి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.