Share News

Jubilee Hills by-election: ఇంటి నుంచే ఓటింగ్‌.. నేడు ప్రారంభం

ABN , Publish Date - Nov 04 , 2025 | 07:28 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో వయోధికులు, దివ్యాంగులకు హోం ఓటింగ్‌ నేడు ప్రారంభం కానుంది. అధికారుల బృందం ఇళ్ల వద్దకు వెళ్లి వారు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనుంది. 85 ఏళ్లు దాటిన, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ సదుపాయం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.

Jubilee Hills by-election: ఇంటి నుంచే ఓటింగ్‌.. నేడు ప్రారంభం

- 103 మంది దరఖాస్తు

హైదరాబాద్‌ సిటీ: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(Jubilee Hills by-election)లో వయోధికులు, దివ్యాంగులకు హోం ఓటింగ్‌ నేడు ప్రారంభం కానుంది. అధికారుల బృందం ఇళ్ల వద్దకు వెళ్లి వారు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనుంది. 85 ఏళ్లు దాటిన, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ సదుపాయం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ నేపథ్యంలో 84 మంది వయోధికులు, 19 మంది దివ్యాంగులు ఫారం-21లో ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం కోసం దరఖాస్తు చేశారు. 4, 6 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 103 మందితో ఓటింగ్‌ చేయించనున్నట్టు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ సాయిరాం(Returning Officer Sai Ram) తెలిపారు.


city3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 07:28 AM