Home » Jammu and Kashmir
Pahalgam Terror Attack: పర్యాటకుల ప్రాణాలు రక్షించడానికి ధైర్య సాహసాలు ప్రదర్శించిన మృతుడు సయ్యద్ ఆదిల్‌కు ‘ బ్రేవరీ అవార్డు’ను ప్రకటించారు. ఈ అవార్డును వారి కుటుంబసభ్యులకు అందించారు. ఆదిల్ సోదరుడు సయ్యద్ నాజకత్ హుస్సేన్‌కు ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది.
JD Vance: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరు దేశాలకు కీలక సూచన చేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికి కశ్మీర్‌లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ ఆఫీజ్ సయ్యద్‌కు నాలుగు రెట్లు భద్రత కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశం దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫోన్ కాల్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
పహల్గాం దాడికి రెండు రోజుల ముందు నుంచే బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఉగ్రవాదులు వేరే మూడు చోట్ల మారణకాండ సృష్టించాలని నిర్ణయించుకున్నారు.
పహల్గాం ఉగ్రవాదులు ఇప్పటికీ కశ్మీ్ర్‌లో ఉండి ఉండొచ్చని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరిసాయం లేకుండా మనగలిగేలా అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చినట్టు భావిస్తున్నాయి.
Jammu and Kashmir: గాయపడ్డవారిలో 9 మంది స్పెషల్ క్విక్ యాక్షన్ టీమ్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వాహనం బోల్తా పడిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. గాయపడ్డ వారిని బయటకు తీసుకురావటానికి సాయం చేశారు
Pahalgam Terror Attack: అందరూ అక్కడే ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లారు. మ్యాగీ ఆర్డర్ చేసుకుని తిన్నారు. మ్యాగీ తినటం అయిపోయిన తర్వాత టీ ఆర్డర్ చేశారు. ఇక్కడ వీళ్లు టీ తాగుతున్న సమయంలో కింద లోయలో బుల్లెట్ల వర్షం మొదలైంది.
వేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన మంగళవారంనాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో పహల్గాం మృతుల కుటుంబాలకు తొలుత సంతాపం ప్రకటించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.